Bangladesh: మరోసారి భగ్గుమన్న బంగ్లాదేశ్.. 32 మంది మృతి

బంగ్లాదేశ్‌ మరోసారి హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి అధికార పార్టీ మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య ఆదివారం ఘర్షణలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

Bangladesh: మరోసారి భగ్గుమన్న బంగ్లాదేశ్.. 32 మంది మృతి
New Update

బంగ్లాదేశ్‌ మరోసారి భగ్గుమంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి అధికార పార్టీ మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య ఆదివారం ఘర్షణలు చెలరేగాయి. ప్రధామంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు టియర్ గ్యాస్‌లు వినియోగించారు. ఈ హింసాత్మక ఘర్షణలో సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఇదే అంశంపై చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 200 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.

Also Read: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం.. ఇజ్రాయెల్‌పై దాడులు

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ భారతీయులను అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్న విద్యార్థులతో పాటు భారతీయ పౌరులు తమతో టచ్‌లో ఉండాలని సిల్హట్‌లోని అసిస్టెంట్‌ హైకమిషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటన చేసింది. అలాగే దీనికి సంబంధించి స్థానిక కార్యాలయ ఫోన్‌ నెంబర్లను అందుబాటులో ఉంచింది. మరోవైపు తాజా ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల నుంచి నివధిక కర్ఫ్యూ విధించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కాదని.. ఉగ్రవాదులని ప్రధాని షేక్ హసీనా అన్నారు. ఇలాంటి వారిని అణిచివేయాలంటూ పౌరులకు పిలుపునిచ్చారు.

అసలేంటి వివాదం
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. చివరికి అత్యున్నత న్యాయస్థానం ఆ కోటాను 5 శాతానికి తగ్గించింది. 93 శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని.. మైనార్టీలకు 1 శాతం, వికలాంగులు, థర్డ్ జెండర్‌లకు 1 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయినప్పటికీ కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. తమను అణిచివేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం బాధ్యత వహించాలని.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: 2029 లో ప్రధానిగా మోదీ..ప్రతిపక్ష హోదాలో భారత్ కూటమి..అమిత్ షా

#telugu-news #bangladesh #govt-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe