National : దేశంలో 31 రాష్ట్రాలు సంతానోత్పత్తిలో స్థిరీకరణ- కేంద్ర ఆరోగ్యశాఖ

దేశంలోని 36 రాష్ట్రాల్లో 31 రాష్ట్రాలు జనాభా స్థిరీకరణకు చేరుకున్నాయని చెబుతోంది కేంద్ర ప్రభుత్వ డేటా. ప్రస్తుత సంతానోత్పత్తి రేటు 2.1గా ఉందని తెలిపింది. ఇది భవిష్యత్తులో భారత జనాభా పెరుగుదలను కంట్రోల్ చేస్తుందని  భారత ఆరోగ్యశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

New Update
National : దేశంలో 31 రాష్ట్రాలు సంతానోత్పత్తిలో స్థిరీకరణ- కేంద్ర ఆరోగ్యశాఖ

India Population : ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా గల దేశాల్లో ఛైనా (China), ఇండియా (India) లు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి. ప్రస్తుతం చైనా మన కంటే ముందుంది. అయితే ఐక్యరాజ్య సమితి గణాంకాలు ఫ్యూచర్‌లో చైనాను భారతదేశం అధిగమిస్తుందని చెబుతున్నాయి. అయితే భారత కేంద్ర ప్రభుత్వం మాత్రం మన దేశంలో జనాభా ఉత్పత్తి చాలా మట్టుకు కంట్రోల్‌కు వచ్చిందని చెబుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 36 రాష్ట్రాల్లో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ కలుపుకుని జనాభా స్థిరీకరణను సాధించాయి చెబుతోంది. దీని ప్రకారం ప్రతీ మహిళకు సగటున 2.1 రేటు చొప్పున సంతానం కలిగి ఉన్నారని లెక్కలు చూపిస్తోంది. అయితే ఒక ఐదు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అధిక సంతానోత్పత్తి ఉందని తెలిపింది. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మేఘాలా, మణిపూర్‌లో సంతానోత్త్తి ఎక్కువగా ఉంది.

నిన్న ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day 2024) సందర్భంగా హెల్త్ మనిస్టర్ జేపీ నడ్డా (JP Nadda) భారత జనాభాకు సంబంధించిన లెక్కలను పరిశీలించారు. జనాభా పెరుగుదల కోసం తీసుకోవాల్పిన చర్యలపై ఆరోగ్యశాఖా సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌తో చర్చించారు. వికాస్ భారత్ సాధించాంటే...సంతానోత్పత్తిని కంట్రోల్ చేయాల్సిందేనని మంత్రులు నిర్ణయించారు. చిన్న కుటుంబాలతోనే భారతదేశం పురోగతిని సాధింగలదని ఆరోగ్య మంత్రి నడ్డా అన్నారు. భారతదేశంలో 65శాతం కంటే ఎక్కువ మంది జనాభా పునరుత్పత్తి సామర్ధ్యం కలవయసులో ఉన్నారని మంత్రి అనుప్రియ తెలిపారు. అందుకే ప్రతీ ఒక్కరూ కుటుంబ నియంత్రణను పాటించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కోసం గతంలో రెండు దశలుగా ఉన్న కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రస్తుతం మూడు దశలుగా విస్తరించారు. దీనిని సన్నాహక దశ, సమాజ భాగస్వామ్యం ,సేవా పంపిణీ అనే ాగాలుగా విభజించారు.

1950లో భారతదేశం TFR 6.18ని కలిగి ఉంది, అది 1980లో 4.6కి తగ్గింది. 2021లో, TFR మరింతగా 1.91కి తగ్గింది, ఇది స్థిరమైన జనాభా పరిమాణాన్ని నిర్వహించడానికి అవసరమైన భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉంది. ఇటీవల, ఒక అధ్యయనం 2050 నాటికి, భారతదేశం యొక్క TFR 1.29కి తగ్గుతుందని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా చెప్పారు. ఏడు దశాబ్దాల కుటుంబ నియంత్రణ కార్యక్రమాల కార్యకలాపాలు ఫలితాలను చూపించాయని చెప్పారు.

Also Read:Evarest: ఆహా.. అద్భుతమనిపిస్తున్న ఎవరెస్ట్ వీడియో

Advertisment
తాజా కథనాలు