శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యనగరంలోని రామాలయంలోని పూజారుల నియామకానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ నుంచి ఆలయ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు ముస్తాబుఅవుతోంది. దీంతో శ్రీరామ జన్మభూమితీర్థ క్షేత్ర ట్రస్ట్ పూజారుల నియామకంతో సహా ఇతర ప్రక్రియలకు శ్రీకారం చుట్టింది.
పూజారుల పోస్టులకు ఇంటర్వ్యూలు:
సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత ఆలయాన్ని ప్రజల దర్శనం కోసం తెరుస్తారు. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించిన అర్చకుల ఖాళీల భర్తీ ప్రకటనకు ప్రతిస్పందనగా 3వేల మంది అభ్యర్థులు పూజారి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 200మందిని ఇంటర్వ్యూకోసం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
కరసేవక్ పురంలో ఇంటర్వ్యూలు :
ఎంపికైన 200 మంది అభ్యర్థులు అయోధ్యలోని విశ్వ హిందూ పరిషత్ (VHP) ప్రధాన కార్యాలయం అయిన కరసేవక్ పురంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్వ్యూల తర్వాత ట్రస్ట్ చివరకు 20 మంది అభ్యర్థులను పూజారుల ఉద్యోగాలకు సెలక్ట్ చేస్తుంది.
ఇక ఇందులో సెలక్ట్ అయిన అభ్యర్థులు 6 నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ తర్వా రామజన్మభూమి కాంప్లెక్స్ లోని పలు పోస్టుల్లో నియమిస్తారు. ట్రైనింగ్ తర్వాత పూజారులకు సర్టిఫికేట్లు జారీ చేసి భవిష్యత్తులో వారిని రామాలయం అర్చకుల పోస్టుల్లో భర్తీ చేస్తామని ట్రస్టు సభ్యుడు వెల్లడించారు. నిపుణుల ప్యానెల లిస్టు చేసిన అభ్యర్థులను సంధ్యావందనం వంటి పూజలు, శ్రీరాముని ఆరాధనకు సంబంధించిన ఇతర పూజల పనితీరు, ఆచారాలపై ఇంటర్వ్యూ చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు తెలిపారు.
పూజారుల పోస్టుల భర్తీ అభ్యర్థులకు అగ్రశ్రేణి సాధువులు తయారు చేసిన మతపరమైన పాఠ్యాంశాలపై శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు నెలవారీ రూ. 2వేల స్టైఫండ్ తోపాటు భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ముగ్గురు సభ్యుల ప్యానెల్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది:
ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తుందన్నారు. ఈ ప్యానెల్‌లో బృందావన్‌కు చెందిన ప్రసిద్ధ హిందూ బోధకుడు జైకాంత్ మిశ్రా, అయోధ్యకు చెందిన ఇద్దరు మహంతులు మిథిలేష్ నందనీ శరణ్, సత్యనారాయణ దాస్ ఉన్నారు. ఆలయంలో 20 మంది పూజారులు ఉంటారని గోవింద్ గిరి తెలిపారు. ఈ 200 మంది అభ్యర్థుల్లో ఎవరిని మాత్రమే ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు 6 నెలల శిక్షణ ఇచ్చిన తర్వాత వారిని అర్చకులుగా నియమిస్తామని, వారిని ఆలయ పరిధిలోని వివిధ పోస్టుల్లో నియమిస్తామని చెప్పారు.
అభ్యర్థులను అడిగిన ప్రశ్నలు:
పూజారి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూలో సంధ్య వందనం అంటే ఏమిటి? దాని పద్ధతి ఏమిటి? అని అడుగుతున్నారు. దీనితో పాటు పూజకు మంత్రాలు కూడా అడుగుతున్నారు. శ్రీరాముడిని ఆరాధించడానికి మంత్రాలు ఏమిటి? దానికి సంబంధించిన ఆచారాలు ఏమిటి? అని కొంతమంది అభ్యర్థులను కూడా అడిగారని ఆయన చెప్పారు. దీంతో పాటు 20 మంది అభ్యర్థులకు అయోధ్యలోని కరసేవక్ పురంలో 6 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇంటర్ పాసైతే చాలు..గూగుల్లో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!!