Abujmarh Maoist Encounters : అబూజ్‌మడ్ అడవుల్లో తెలుగు మావోయిస్టు(Maoist) లే టార్గెట్‌గా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. రోజూ ఇందులో ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. నిన్నటి ఎన్‌కౌంటర్(Encounter) లో ముగ్గురు తెలంగాణ(Telangana) మావోయిస్టులు మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన రవి అలియాస్ వినయ్ , చీరాల నర్సయ్య, తిక్క సుష్మిత అనే ముగ్గురు మరణించారు. రవిపై రూ. 8 లక్షల రివార్డు, గోపన్న అలియాస్.. చీమల నర్సయ్యపై 25 లక్షల అవార్డు, తిక్క సుష్మితపై రూ. 2 లక్షల అవార్డు ఉన్నాయి. తెలుగు మావోయిస్టుల వరుస ఎన్‌కౌంటర్‌లతో.. కమిటీ, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.
నాలుగు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) లోని అటవీప్రాంతాల్లో భద్రబలగాలు, మావోయిస్టులకు మధ్య వరుసగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తాజాగా నారాయణపుర్ జిల్లా జిల్లా అబూజ్‌మడ్ అటవీప్రాంతంలో కూడా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. లోక్‌సభ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో దండకారణ్యా్లో గత కొంతకాలంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Also Read:Hyderabad: ఎట్టకేలకు చిక్కిన చిరుత..ఎయిర్ పోర్ట్‌లో ప్రశాంతం