Karnataka : కర్ణాటక(Karnataka) లోని ఓ బాణసంచా(Fire Cracker) తయారీ ఫ్యాక్టరీలో విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు(Explosion) సంభవించడంతో.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. దక్షిణ కర్ణాటకలో బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ దర్ఘటన చేటుచేసుకుంది. ఈ పేలుడు శబ్ధం చాలా మైళ్ల దూరం వరకు వినిపించినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.
Also Read: డిగ్రీ అర్హతతో ‘ఎన్‌ఆర్‌ఎస్‌సీ’లో ఉద్యోగాలు.. అప్లికేషన్ వివరాలివే
ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు(Injuries) ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం పేలుడు సంభవించడంతో సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పేశాయి. కానీ అప్పటిక అందులో చిక్కుకున్న ముగ్గురు కార్మికులు చనిపోయారు. మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)లుగా గుర్తించారు. అయితే ఆ ఫ్యాక్టరీలో పేలుడు ఎలా సంభవించింది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తు్న్నారు.
Also read: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు