దేశంలో రోజుకు 78 హత్యలు.. నివేదికలో బయటపడ్డ కీలక విషయాలు..

దేశంలో 2022లో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో 29,272 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే 2021 కంటే 2022లో 2.6 శాతం హత్య కేసులు తగ్గాయి. వివాదాలు, ప్రతికారాలు, శతృత్వం ఈ హత్యలకు ప్రధాన కారణాలు.

New Update
New York: ప్రియురాలి కోసం సీఈవోను దారుణంగా చంపిన పీఏ!

ఈ ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఓ చోట హత్య కేసులు జరగుతూనే ఉంటాయి. అయితే ఇండియాలో 2022లో ఏకంగా 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్కరోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో మొత్తం 29,272 హత్య కేసులు నమోదయ్యాయి. 2021తో పోల్చితే 2022లో హత్య కేసులు 2.6 శాతం తగ్గాయి. ఈ హత్యలకు ప్రధాన కారణాలు వివాదాలే. ఆ తర్వాత వ్యక్తిగత ప్రతీకారం, శతృత్వం, వ్యక్తిగత ప్రయోజనం కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. 2022లో సాధారణ నేరాలు తగ్గగా.. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలు, వృద్ధులపై మాత్రం నేరాలు పెరిగాయి. సోమవారం విడుదలైన జాతీయ నేరగణంకాలు 2022 ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే 2021తో పోలిస్తే 2022లో సాధారణ నేరాల సంఖ్య 4.5 శాతం తగ్గిపోయింది.

Also Read: గ్రూప్-2 పరీక్షపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు.. మరో నెల రోజుల్లోనే ఎగ్జామ్..!!

Advertisment
తాజా కథనాలు