పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సులో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక వివారాల్లోకి వెళ్తే.. టర్బాట్ నుంచి క్వెట్టాకు ఓ బస్సు వెళ్తోంది. కనుమ మార్గం గుండా ప్రయాణిస్తుండగా.. సడన్‌గా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Also read: UPI ద్వారా అంతర్జాతీయ చెల్లింపులు చేయడం ఎలా?
సమాచారం మేరకు ఘటనాస్థలనానికి చేరుకున్న సహాయక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. ఇటీవల బాల్టిస్థాన్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయారు.
Also read: ట్రెండ్ అవుతున్న ‘All Eyes on Rafah’.. అసలు స్టోరీ ఇదే