Custodial Rape Cases: దేశంలో కస్డడీ రేప్ కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ..

గత ఐదేళ్లలో దేశంలో 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. 2017 నుంచి మహిళలపై జరిగిన 275 కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 92 కేసులు నమోదుకాగా.. మధ్యప్రదేశ్‌లో 43 కేసులు నమోదయ్యాయి.

New Update
Rape Case: తప్ప తాగి.. జ్వరంతో ఉన్న కూతురిని రేప్ చేసిన దుర్మార్గుడు!

గత ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 275 కస్టడీ రేప్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. జైలులో మహిళా ఖైదీలపై జరిగిన అత్యాచారం కేసుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్‌ ఉండగా.. రెండో స్థానంలో మధ్యప్రదేశ్‌ ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో (NCRB) డేటా ప్రకారం చూసుకుంటే.. 2017 నుంచి 2022 వరకు మొత్తం 275 కస్టడీ రేప్ కేసులు రికార్డ్‌ అయ్యాయి.

Also Read:  నేను సీబీఐ విచారణకు రాను.. కవిత షాకింగ్ రిప్లై

యూపీ టాప్‌

2017లో 89 కేసులు నమోదుకాగా.. 2018లో 60 కేసులు నమోదయ్యాయి. 2019లో 47, 2020లో 29, 2021లో 26, 2022లో 24 కేసులు నమోదయ్యాయి. అయితే 2017 నుంచి మహిళలపై జరిగిన 275 కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 92 కేసులు నమోదయ్యాయి. ఇక మధ్యప్రదేశ్‌లో 43 కేసులు నమోదయ్యాయి. కస్టడీలో ఉన్న మహిళల రేప్‌కు సంబంధించిన కేసుల్లో పోలీసులు, పబ్లిక్‌ సర్వెంట్లు, సాయుధ దళాల సభ్యలు, రిమాండ్‌ హోం సిబ్బంది, జైలు సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది నిందితులుగా ఉన్నారు.

మహిళా ఖైదీలకు గర్భం

ఇదిలాఉండగా.. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, బిడ్డల్ని కనడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళలకు గత ఏడాది నుంచి ఇప్పటివరకు 196 మంది పిల్లలు పుట్టారని అమికస్ క్యూరీ కోర్టుకు నివేదిక అందించింది. కస్టడీలో ఉండగానే మహిళా ఖైదీలు గర్భం దాల్చి, జైళ్లలోనే బిడ్డలకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని తీవ్రమైన సమస్యగా కోల్‌కతా హైకోర్టు పరిగణించింది. మహిళా జైళ్లలోకి పురుష ఉద్యోగుల ప్రవేశాన్ని నిషేధించాలని కోరింది.

Also Read: సముద్రగర్భంలో ద్వారకాకు ప్రధాని మోదీ పూజలు

Advertisment
తాజా కథనాలు