Bengaluru:270సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ..1.36 లక్షల జరిమానా అస్సలు ఈమెకు ట్రాఫిక్, రూల్స్ అనేవి ఒకటి ఉంటాయని తెలియదు కాబోలు. చేతిలో బండి ఉంది నడిపేయడమే అనుకుంది. అందుకే ఒకటి , రెండుసార్లు చూశారు ట్రాఫిక్ పోలీసులు..తరువాత మొత్తం అన్నింటికీ కలిపి 1.36 లక్షల చలానా కట్టాలని నోటీసులు పంపారు. By Manogna alamuru 17 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bengaluru: బెంగళూరులో ఓ మహిళ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు 270 సార్లు పాల్పడిందని చెబుతున్నారు. దీంతో ఆమెకు 1.36 లక్షల ఫైన్ వేశామని తెలిపారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఈమె ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం సీసీ కెమెరాల్లో రాకార్డ్ అయింది. వాటి ఆధారంగా నోటీసులు పంపారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లు, కొత్తవి అన్నీ కలిసి లక్షా ముప్పైఆరు వేలు కట్టాలని ఇంటికి నోటీసులు పంపించారు పోలీసులు. ఎంత చలానా వేసినా బుద్ధిరావడం లేదు.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు పద్ధతి మారి చలాన్లు అన్నీ డైరెక్ట్‌గా వచ్చేస్తున్నాయి. పోటీసులు ఫోటోలు తీస్తున్నారు, లేదా సీసీ కెమెరాల ఆధారంగా చలాన్లు వేస్తున్నారు. దీంతో జనాలు ట్రాఫిక్ రూల్స్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆన్‌లైన్‌లో ఫైన్ కట్టడమే కాబట్టి పెద్ద ఇబ్బందిగా కూడా ఫీల్ అవ్వడం లేదు. అంతకు ముందు పోలీసులు స్వయంగా పట్టుకుని చలాన్లు వేసేవారు. దాంతో కొంచెం అయినా భయం ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతి లేకపోవడంతో రెచ్చిపోతున్నారు. బెంగళూరులాంటి బిజీ ట్రిఫిక్ ఉన్న సిటీల్లో ఇది మరీ ఎక్కువైపోయింది. ఎంత భారీగా జరిమానాలు విధించినా ప్రజలు పట్టించుకోవడం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి భారీ జరిమానాలు విధించామని తెలిపారు. ఇటీవల, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక బైక్ యజమానిపై కేసు నమోదు చేసి రూ.3.2 లక్షల జరిమానా విధించామని పోలీసు జాయింట్ కమిషనర్ ఎంఎన్ అనుచేత్ తెలిపారు. నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 2,681 వాహనదారుల నుంచి ఇప్పటి వరకు రూ.50,000లకు పైగా జరిమానాలను సేకరించినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. Also Read:Hyderabad: ఇన్స్టా రీల్స్ కోసం స్కూటర్ల దొంగతనం #woman #bengaluru #challan #taffric-rules మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి