Drugs: విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్ సీజ్ బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న కంటైనర్ విశాఖపట్నానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. By B Aravind 21 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి 25000 Kg Drugs Seized in Vishakhapatnam: విశాఖపట్నం తీరంలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్‌లో ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్ సమాచారంతో ఢిల్లీ సీబీఐ అధికారులు.. విశాఖపట్నంలో ఉన్న సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రత్యేక బృందాలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈనెల 19వ తేదీన నార్కోటిక్స్ సామగ్రి, పలువులు నిపణులతో సీబీఐ అధికారులు వచ్చి.. అక్కడ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. Also read: జనసేన పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల నిరసన.. ఆపరేషన్ గరుడలో భాగంగా ఆ 25 వేల కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా మార్చి 16న కంటైనర్ విశాఖపట్నానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఓ ప్రైవేటు కంపెనీ 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు సమాచారం. Also Read: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఈడీ బృందం.! #telugu-news #drugs #national-news #vizag-port మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి