మారని పాకిస్థాన్ వక్రబుద్ధి.. భారత్ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం!

కుక్క తోక వంకరన్నట్టు, టెర్రరిజం విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా పాకిస్థాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను దేశంలోకి పంపే కుట్రలకు తెరతీసింది. నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ పహారా కాస్తోంది.

New Update
మారని పాకిస్థాన్ వక్రబుద్ధి.. భారత్ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం!

BSF: కుక్క తోక వంకరన్నట్టు కొన్ని విషయాల్లో పాకిస్థాన్‎దీ అదే తీరు. ముఖ్యంగా టెర్రరిజం విషయంలో ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తిన్నా ఆ దేశం వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పడానికి ప్రయత్నించి ఎన్నిసార్లు భంగపడినా బుద్ధి మారలేదు. తాజాగా మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను దేశంలోకి పంపడానికి కుట్రలకు తెరతీసింది. నిఘావర్గాల నుంచి ఈ పరిణామాలపై స్పష్టమైన హెచ్చరికలు రావడంతో సరిహద్దు భద్రతా దళం (BSF) అప్రమత్తమైంది. సరిహద్దుల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.

ఇది కూడా చదవండి: ‘బిగ్‌ సీ’లో మొబైల్‌ కొంటే ఏకంగా రూ.లక్ష హెల్త్‌ బెనిఫిట్స్‌!

మరోసారి సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు పాకిస్థాన్ తెగబడింది. దీనిపై స్పష్టమైన సమాచారంతో నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో సైన్యం అప్రమత్తమైంది. బీఎస్ఎఫ్ విస్తృతంగా భద్రత ఏర్పాట్లు చేసి సరిహద్దుల వెంబడి పహారా కాస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో చొరబాటుకు ప్రయత్నించడం

దాదాపు 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్ సరిహద్దు నుంచి జమ్మూ కశ్మీర్‌లో చొరబడేందుకు చూస్తున్నారని బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లోని లాంచ్‌ప్యాడ్‌లో వారు దాక్కుని ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. దీంతో భద్రత బలగాలను అప్రమత్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఆధార్ తరహాలో దేశంలో అపార్ కార్డులు…బెనిఫిట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..అర్హులెవరో తెలుసా?

పుల్వామా జిల్లాలో లాంచ్‌ప్యాడ్‌ల వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులున్నట్లు నిఘావర్గాల నుంచి సమాచారం ఉందన్న బీఎస్ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అశోక్‌ యాదవ్‌ వారి చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్‌ తిప్పికొడుతుందని పేర్కొన్నారు. సున్నితమైన ఈ ప్రాంతంపై సైన్యం ఆధిపత్యం కొనసాగుతుందని, బోర్డర్లో బీఎస్‌ఎఫ్‌, ఆర్మీ అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు.

శతృదేశపు ఆగడాలను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతిఘటించేందుకు ఆర్మీ, భద్రత బలగాలు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాయని, ఏమాత్రం ఏమరపాటుకూ అందులో తావు లేదని ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు