కుక్కలపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఓ వ్యక్తికి 249 ఏళ్ల జైలుశిక్ష!

కుక్కలపై లైంగిక దాడి చేసి వాటి చంపిన ఓ వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు 249 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిటన్‌కు చెందిన ఆడమ్ కుక్కల పై అత్యాచారం చేసి చంపుతున్నట్టు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీని పై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

కుక్కలపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఓ వ్యక్తికి 249 ఏళ్ల జైలుశిక్ష!
New Update

హత్యలు, లైంగిక వేధింపులు తరచూ జరుగుతున్న ఈ రోజుల్లో, బ్రిటన్‌కు చెందిన ఓ జంతుశాస్త్రవేత్త కుక్కలను లైంగికంగా వేధించి, హింసించి చంపిన ఘటన చోటుచేసుకుంది.ఆడమ్ బ్రిటన్ అనే మొసళ్ల పరిశోధన నిపుణుడు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు.అతను మొసళ్లపై పరిశోధన చేసి పి.హెచ్.డి కూడా తీసుకున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా 60 కి పైగా పెంపుడు కుక్కలను లైంగికంగా వేధించి చంపాడని అతని పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అదేమిటంటే ఆడమ్ బ్రిటన్ మొసళ్లపై పరిశోధనలు చేస్తూ తన ఇంటికి దగ్గర్లోనే షిప్పింగ్ కంటైనర్ లో రీసెర్చ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. కుక్కలను లైంగికంగా వేధించడం నుంచి హింసించి చంపడం వరకు వీడియోలు రికార్డు చేశాడు. ఈ వీడియోలను తన సోషల్ మీడియా పేజీలలో అప్‌లోడ్ కూడా చేశాడు. 

గతేడాది అతడిని అరెస్ట్ చేసిన ఆస్ట్రేలియా పోలీసులు.. అతడిని విచారించగా పలు విస్మయకర సమాచారాన్ని వెల్లడించారు. అతను కుక్కలను పెంచడు.కానీ ఎవరైనా ఊరు వెళ్తున్నప్పుడు తమ పెంపుడు కుక్కను చూసుకునే వారి కోసం సాధారణంగా వెతుకుతుంటారు.అలాంటి వారికీ ఆడమ్ బ్రిటన్ మొదట గుర్తుకు వస్తాడు. వాళ్లకి కుక్కల బాగోగులు చూసుకుంటానని మొదట చెప్పాడు.వారు కూడా ఆడమ్ బ్రిటన్ జంతుశాస్త్రవేత్త కాబట్టి వారు తమ పెంపుడు కుక్కలను వదిలివేస్తారు. చాలా మంది ఊరు వదిలి తిరిగి రారు. అలాంటి కుక్కలను లైంగికంగా వేధించి హింసించి చంపేస్తాడు. బహుశా అతను తిరిగి వచ్చి కుక్కలను అడిగితే, వాటిని పెంచిన వారి కోసం బెంగ పెట్టుకుని అవి తినకుండా చనిపోయాయని అతను చెప్తాడని అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో ఆడమ్ బ్రిటన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను చూసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత గత ఏడాది అరెస్టయి జైలు పాలయ్యాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆడమ్ బ్రిటన్ 'పారాఫిలియా' అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అంటే నిర్జీవ వస్తువులను, పిల్లలను, జంతువులను లైంగికంగా వేధించి ఆనందించే మానసిక వ్యాధితో వారు బాధపడుతున్నట్లు తేలింది.

అయితే, ఒక ప్రైవేట్ గదిని సృష్టించడం నుండి కుక్కలను లైంగికంగా వేధించడం, అందులో కెమెరాలు అమర్చడం, వీడియో తీయడం  సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం వరకు అన్నింటికీ ప్లాన్ చేసినందుకు ఆడమ్ బ్రిట్టన్‌కు ఆస్ట్రేలియా కోర్టు 249 సంవత్సరాల జైలు శిక్షను సమర్థించింది.

#killed-dog #animals #rape #dog
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe