Telangana: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. 2,364 మంది రెగ్యులరైజ్‌

సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్జూద్‌లుగా రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సంస్థ ఎండీ ఎన్‌.బలరామ్ వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.

Telangana: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌.. 2,364 మంది రెగ్యులరైజ్‌
New Update

తెలంగాణలో సింగరేణి కార్మికులకు ఆ సంస్థ యాజమాన్యం గుడ్‌న్యూస్ చెప్పింది. సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్జూద్‌లుగా రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సంస్థ ఎండీ ఎన్‌.బలరామ్ వెల్లడించారు. సంస్థలో చేరినప్పటినుంచి ఏడాదిలో 190 రోజులు భూరగ్భ గనుల్లో, 240 రోజులు ఉపరితల గనులు, విభాగాల్లో విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.

Also Read: కూతురు వరసయ్యే అమ్మాయితో.. ఆ కౌన్సిలర్ ఏం చేశాడంటే?

సెప్టెంబర్ 1 నుంచి వీళ్లను జనరల్ మజ్జూర్‌లుగా గుర్తించనున్నామని పేర్కొన్నారు. ఆలస్యం లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించడం పట్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా చేరిన వారిని ముందుగా బదిలీ వర్కర్లుగా సంస్థ నియమిస్తుంది. ఏడాది పాటు పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే.. జనరల్ మజ్దూర్లు అంటే శాశ్వత ఉద్యోగులుగా సంస్థ గుర్తిస్తోంది. ఉన్నత విద్యార్హతలు ఉన్న వీళ్లందరూ కంపెనీలో ఇంటర్నల్ ఉద్యోగాలా ద్వారా ప్రమోషన్లు పొందడానికి అర్హత ఉంటుంది. అలాగే క్వార్టర్ల కేటాయింపుల్లో కూడా ప్రాధాన్యత లభిస్తుంది.

Also Read: హైడ్రా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసివస్తుందా?

#telugu-news #singareni #telangana-news #singareni-workers
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe