Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలు...23 మంది ఆర్మీ గల్లంతు

సిక్కిం రాష్ట్రాన్ని మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న రాత్రి కురిసిన ఎగతెగని వర్షానికి అక్కడి తీస్తా నది ఉప్పొంగి లాచెన్ లోయ మొత్తం మునిగిపోయింది. అదే లోయలో ఉన్న ఆర్మీ పోస్టులు నీట మునిగిపోవడంతో అందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.

New Update
Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలు...23 మంది ఆర్మీ గల్లంతు

ఉత్తర సిక్కిం లోనాక్ సరస్సు ప్రాంతంలో నిన్న రాత్రి విపరీతమైన వర్షం కురిసింది. దీనివలన తీస్తానది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే సమయంలో చుంగ్ థామ్ డ్యామ్ నుంచి కూడా నీటిని వదిలారు. దీంతో అక్కడి పరిస్థితి మరింత దిగజారింది. రెండు నీటి ప్రవాహాలు కలిసి వరదల రూపంగా మారాయి. దీంతో ఉత్తర సిక్కిం అంతా నీట మునిగిపోయింది. అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ మెరుపు వరదలు సంభవించాయి.

sikkim floods

వరద నీటిలో లాచెన్ లోయలో ఉన్న ఆర్మీ పోస్టులు అన్నీ మునిగిపోయాయి. సింగ్తమ్ ప్రాంతంలోని ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. వాటిల్లోనే 23 మంది ఆర్మీ సిబ్బంది కూడా గల్లంతయ్యారని ఈస్ట్రస్ కమాండ్ తెలిపింది. మొత్తం 41 వాహనాలు నీటిలో మునిగిపోయాయి. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. చాలా చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. పశ్చియ బెంగాల్, సిక్కింను కలిపే 10వ నెంబర్ జాతీయ రహదారి కూడా చాలా చోట్ల కొట్టుకుపోయింది. దాంతో పాటూ సింగ్తమ్ పుట్ బ్రిడ్జ్ కూలిపోయింది. దీని మీద సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమంగ్ వెంటనే స్పందించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తీస్తా ఒడ్డున ఉన్న వారిని సహాయక బృందాలు ఖాళీ చేయిస్తున్నారు.

Also read:న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థా అరెస్ట్

కాంపౌండ్ ఆర్చరీలో భారత మహిళలకు గోల్డ్

నేడు ప్రపంచ జంతు దినోత్సవం..దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి..?

Advertisment
తాజా కథనాలు