45,396 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. పూర్తి వివరాలివే

దేశవ్యాప్తంగా వివిధ విభాగాలు, శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించి ఆయా నియామక సంస్థలు వరుసగా జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ తదితర కోర్సుల వారు అర్హులు.

New Update
45,396 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. పూర్తి వివరాలివే

2023 Central Government Jobs : సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాలు, శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించి ఆయా నియామక సంస్థలు వరుసగా జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఎస్‌ఎస్‌సీ- 26,146 కానిస్టేబుల్ పోస్టులు, ఇంటెలిజెన్స్ బ్యూరో- 995 ఏసీఐవో పోస్టులు, ఎస్‌బీఐ- 8,773 జూనియర్‌ అసోసియేట్‌ జాబ్స్‌, 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు, ఐడీబీఐ 2,100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎయిమ్స్‌- 3,036 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు, తపాలా శాఖ- 1,899 పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్ పోస్టులున్నాయి. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై.. కొనసాగుతోంది. ఉద్యోగ ఖాళీలను బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ తదితర కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు నిర్దేశించిన తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Also read : జేఎన్‌టీయూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు ఆహ్వానం.. పూర్తి అర్హతలివే

1. 10వ తరగతి అర్హతతో 26,146 ప్రభుత్వ ఉద్యోగాలు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

2. డిగ్రీతో 2,100 ఉద్యోగాలు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

3. 995 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/

4. కేంద్ర విద్యుత్‌ సంస్థలో 203 ఉద్యోగాలు. రూ.74,000 వరకూ జీతం. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://www.powergrid.in/

5. తపాలా శాఖలో 1,899 ఉద్యోగాలు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు. ఎంపికైతే రూ. 81,100 వరకూ జీతం. పూర్తి వివరాలకోసం.. https://dopsportsrecruitment.cept.gov.in/

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు