ఈ మధ్యకాలంలో చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటివి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి గుండె పోటుతో మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం, గుమ్మడవెల్లికి చెందిన ఇస్లావత్ సిద్దు (20) శేరిదగూడలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ డిప్లొమా EEEలో మూడో సంవత్సరం చదువుతున్నాడు.
Also Read: నాగలాండ్‌లోని ఆ ప్రాంతంలో సున్నా శాతం ఓటింగ్.. కారణం ?
శనివారం మధ్యాహ్నం ఉదయం 1:30 గంటలకు స్నేహితులతో కలిసి ఉండగా.. సిద్దు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ వెళ్లే దారిలోనే సిద్దు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సిద్దుకి ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవని స్నేహితులు, కుటుంబ సభ్యలు చెప్పారు.
Also Read: రైతులకు గుడ్ న్యూస్..వారి ఖాతాల్లో రూ. 10వేలు జమ..పూర్తి వివరాలివే.!