New Delhi: కార్ పార్కింగ్ కోసం కొట్టుకున్న ఇరుగుపొరుగు..ఆరుగురు అరెస్ట్ కొన్నాళ్ళ క్రితం రెండు ఇళ్ళ మధ్య కార్ పార్కింగ్ గొడవ అనే కాన్సెప్ట్‌తో ఓ సినిమా వచ్చింది గుర్తుందా. అచ్చం అలాంటి గొడవే నిన్న న్యూ ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. కానీ అది కాస్తా పెద్దది అయి కొట్టుకునే వరకు వెళ్ళింది. వివరాలు కింద చదివేయండి. By Manogna alamuru 28 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Car Parking Dispute: ఢిల్లీలోని నోయడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఎప్పటి నుంచో ఇరుగు, పొరుగున ఉంటున్నారు. ఒకరికి ఒకరు బాగా తెలిసిన వారే. కానీ కారు పార్కింగ్ విషయంలో గొడవపడి రచ్చ రచ్చ చేశారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లో ఈ ఘటన జరిగింది. ఇక్కడే నివాసం ఉండే రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కార్ పార్కింగ్ వివాదం జరిగింది. నితిన్ తరుఫు వ్యక్తులు మొదట రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత రాజీవ్ కొడుకులు నితిన్ కారును ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్లతో కారు అద్దాలను పగులగొట్టారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల్లో మహిళల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఈ గొడవ పోలీసుల వరకు వెళ్ళింది. గొడద కాస్తా కొట్లాటకు దారి తీయడంతో ఎంటర్ అయిన పోలీసులు దీనిపై కేసు నమోదు చేయడమే కాకుండా ఆరుగురిని అరెస్ట్ కూడా చేశారు. ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Kalesh b/w Two parties over car parking in Sector 72's B Block in Noida's Sector 113 police station area, there was a lot of ruckus on the road, the car was broken with a cricket bat, Noida UP pic.twitter.com/ysMagNpWuW — Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024 कार पार्किंग को लेकर आपस में भिड़े पड़ोसी नोएडा : सेक्टर 113 में कार पार्क करने को लेकर दो पक्ष आपस में भिड़ गए. इस दौरान दोनों पक्ष के बीच जमकर मारपीट हुई. इसका वीडियो सोशल मीडिया पर जमकर वायरल हो रहा है.#Noida | #CarPaking | #Viral pic.twitter.com/dXeUac7aeo — NDTV India (@ndtvindia) August 27, 2024 Also Read: Andhra Pradesh: వ్యవసాయ మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగల అరెస్ట్. #car-parking #noida #new-delhi #dispute మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి