Plane Crash: గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. చివరికీ

కెన్యాలోని విల్సన్ విమానశ్రయంలో టేకాఫ్‌ అయిన సఫారీలింక్ ఏవియేషన్‌ ఫ్లైట్‌.. మరో చిన్నపాటి శిక్షణా విమానం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో శిక్షణా విమానం కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఇక సఫారీలింక్ ఏవియేషన్ ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు.

New Update
Plane Crash: గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. చివరికీ

Plane Crash: రోడ్డుపై వెళ్లే వాహనాలు, పట్టాలపై వెళ్లే రైళ్లు ఒకదానికొకటి ఢీకొనే ఘటనలు ఎక్కడో ఓ చోట నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ గాల్లో ప్రయాణించే విమానాలు కూడా ఒకదానికొకటి ఢికొన్న ఘటనలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా.. రెండు విమానాలు గాల్లో ఢీకొన్న ఘటన కెన్యాలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

Also Read: రాష్ట్రమంతటా బాంబులు పెడతాం… సీఎం, మంత్రులకు బెదిరింపులు

ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సఫారీలింక్ ఏవియేషన్‌కు చెందిన ఫ్లైట్‌.. ఐదుగురు సిబ్బందితో సహా.. 44 మందితో మంగళవారం ఉదయం నైరోబీలోని విల్సన్ విమానశ్రయంలో టేకాఫ్‌ అయ్యింది. అయితే అప్పటికే అక్కడ ఓ చిన్నపాటి శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే నైరోబీ నేషనల్ పార్కు గగనతలంలో ఉన్న శిక్షణ విమానాన్ని మరో విమానం ఢీకొట్టింది. దీంతో ఆ చిన్న విమానం కుప్పకూలింది.

ఆ చిన్న విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. విల్సన్‌ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే శిక్షణ ఫ్లైట్‌ను ఢీకొనడంతో భారీ శబ్ధం వినిపించింది. శిక్షణ ఫ్లైట్‌ కుప్పకూలగా మరో ఫ్లేట్‌ను సిబ్బంది ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే ఇందులో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని సపారీలింక్‌ ఏవియేషన్‌ వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు.

Also Read: ‘బడే భాయ్’ అని పిలిచి మోడీని చిక్కుల్లో పెట్టిన సీఎం రేవంత్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు