Cyber Crime: రూ.26 కోట్ల మోసం.. ఇద్దరు సైబర్ నేరగాళ్లు అరెస్టు

పెట్టుబడుల పేరుతో రూ.26 కోట్ల మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను తాజాగా హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పార్ట్‌ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఈ నిందితులు మోసాలకు పాల్పడ్డారని డీసీపీ కవిత తెలిపారు.

Cyber Crime: రూ.26 కోట్ల మోసం.. ఇద్దరు సైబర్ నేరగాళ్లు అరెస్టు
New Update

ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలోకి మొబైల్‌ ఫోన్లు రావడంతో.. సైబర్‌ నేరాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెట్టుబడుల పేరుతో రూ.26 కోట్ల మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను తాజాగా హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులపై జనవరిలో కేసు నమోదు చేశామని.. ఇప్పుడు వారిని అరెస్టు చేశామని సైబర్ క్రైం డీసీపీ కవిత వెల్లడించారు. నిందితులు నోషద్‌, కబీర్‌లు కేరళలో ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పార్ట్‌ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఈ నిందితులు మోసాలకు పాల్పడ్డారని డీసీపీ తెలిపారు.

Also Read:  మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు

' నిందితులు పంపే లింక్‌ను ఎవరైనా క్లిక్‌ చేస్తే.. వాళ్లని టెలిగ్రామ్‌లో యాడ్ చేస్తారు. లైక్ చేయడం, లింక్స్‌ క్లిక్ చేయడం, అంతర్జాతీయ కంపెనీలకు రివ్యూలు రాయడం వంటి పనులు అప్పగిస్తారు. పార్ట్‌ టైం ఉద్యోగం కోసమని చాలామంది బాధితులు అందులో చేరారు. ముందుగా ఆ జాబ్‌లోకి వెళ్లాక కొంత డబ్బు వస్తుంది. ఆ తర్వాత నిందితులు పెట్టుబడులు పెట్టించేలా బాధితులకు మాయమాటలు చెబుతారు. అలాగే ఈ నిందితులను నమ్మి బాధితులు రూ.9 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టారు.

నిందితులు తిరిగి చెల్లింపులు చేయకుండా అకౌంట్‌ను బ్లాక్ చేశారు. ఖాతా ఆగిపోయింది కాబట్టి.. డబ్బులు విడుదల కావాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించారు. ఆ తర్వాత వీటిని వేరు వేరు ఖాతాల్లో జమ చేశారు. ఇలాంటివి 18 బ్యాంకు ఖాతాలు గుర్తించాం. ఇందులో రూ.26 కోట్ల అక్రమ నగదు బదిలీ అయినట్లు గుర్తించామని' డీసీపీ కవిత తెలిపారు.

Also Read: భార్యను హత్య చేసి పరారయ్యాడు.. నిందితుడిపై రూ.2 కోట్ల రివార్డ్‌

#telugu-news #telangana-news #cyber-crime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe