మధ్యప్రదేశ్‌లో కలరా వ్యాప్తి చెందడం భయాందోళనకు గురిచేస్తోంది. అక్కడ 84 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ఇద్దరు మృతి చెందారు. భింద్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫూప్ పట్టణంలోని 5,6,7 వార్డుల్లో నీరు కలుషితమైంది. దీనివల్లే అక్కడి స్థానిక ప్రజలకు కలరా సోకింది. ఈ వ్యాధికి గురైనవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కోలుకున్న రోగులు ఇంటికి వెళ్లారని.. ప్రస్తుతం ఆరుగురు రోగులు ఆసుపత్రిలో ఉన్నారని చీఫ్ మెడికల్, ఆరోగ్య అధికారి డీకే శర్మ తెలిపారు. మరో ఇద్దరు రోగులను గ్వాలియర్ ఆసుపత్రికి తరలించగా వారు కోలుకొని తిరిగివచ్చినట్లు పేర్కొన్నారు.
Also read: ఘోర అగ్నిప్రమాదం.. 40 మంది భారతీయులు మృతి
కలరా సోకిన వారిలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారని చెప్పారు. అలాగే రెండు రోజుల క్రితమే ఓ బాలిక జ్వరంతో చనిపోయినట్లు తెలిపారు. అయితే నగర పాలక సంస్థ కలుషిత నీటి ద్వారాన్ని మూసివేసిందని.. ప్రస్తుతం ఇతర మార్గాల నుంచి అక్కడి స్థానికులకు నీటి సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. అలాగే కలరా సోకిన ప్రాంతంలో సర్వే చేసి శాంపిల్స్ కూడా సేకరించామని.. ఆ ప్రాంత ప్రజలకు క్లోరిన్ మాత్రలు కూడా పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే అక్కడి ప్రజలకు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.
Also Read: ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది.. ‘ది క్వింట్’ కథనంలో సంచలన విషయాలు..