India: ప్రధానిపై రాళ్ల దాడి.. ముక్కు పగిలి రక్తం చిమ్మినా ఆగని ప్రసంగం!

లోక్ సభ ఎన్నికల వేళ ఓ ఆసక్తికర అంశం తెరపైకొచ్చింది. 1967 ఎన్నికల సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై బహిరంగ సభలో రాళ్లు విసిరారు. ఆమె ముక్కు పగిలి రక్తం చిమ్మినా ధైర్యంగా సభలో ప్రసంగించారు. ఈ ఘటన దేశ రాజకీయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

New Update
India: ప్రధానిపై రాళ్ల దాడి.. ముక్కు పగిలి రక్తం చిమ్మినా ఆగని ప్రసంగం!

Indira gandhi: దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల హాడావుడి మొదలైంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాత ఎన్నికలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంఘటనలు మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. 1967లో జరిగిన ఎన్నికల సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై బహిరంగ సభలో రాళ్లు విసిరారు. అది నేరుగా వచ్చి ఆమె ముక్కుకు తగిలి రక్తం కారింది. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం బెదరకుండా ముక్కుకు క్లాత్ చుట్టుకుని ప్రసంగం కొనసాగించారు. ఈ ఘటన దేశ రాజకీయాల్లో మరువలేనిదిగా నిలిచిపోయింది.

ఇటుకలతో దాడి..
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే 1967 ఫిబ్రవరిలో ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లిన ఇందిరా.. భువనేశ్వర్‌ సభకు హాజరైనపుడు గుంపులో కొందరు దుర్మార్గులు ఆమెపై ఇటుక విసిరారు. అందులో ఒక ఇటుక ముక్క ఆమె ముక్కుకు తగలడంతో తీవ్రంగా రక్తం కారింది. ఆమెను వేదికపై నుంచి దింపాలని భద్రతా సిబ్బంది భావించారు. వేదిక వెనుకకు వెళ్లి కూర్చోవాలని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యర్థించడం ప్రారంభించారు. కానీ ఇందిర ఎవరి మాట వినలేదు. ముక్కుకు రుమాలు కప్పుకుని అలాగే నిలబడింది. అక్రమార్కులను మందలిస్తూ.. 'ఇది నాకు అవమానం కాదు. దేశానికి అవమానం. ఎందుకంటే ప్రధానిగా నేను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ ఘటనతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది' అంటూ ధైర్యంగా ప్రసంగించింది.

ఇది కూడా చదవండి: Crime: విద్యార్థినిలతో ఉపాధ్యాయుడి రాసలీలలు.. కీచకుడికి విద్యాశాఖ మద్ధతు!

ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ..
ఆ తర్వాత ఆమె కోల్‌కతా సభలో పాల్గొన్నారు. ఆమె సిబ్బంది, భద్రతా సిబ్బంది ఇందిరాగాంధీని ఢిల్లీకి తిరిగి రావాల్సిందిగా అభ్యర్థించగా అందుకు కూడా ఆమె అంగీకరించలేదు. తదుపరి బహిరంగ సభ కోసం ఆమె కోల్ కతా బయలుదేరారు. ముక్కు పగిలిన ప్రజల ముందు నిలబడి ప్రసంగించారు. ఆ తర్వాత డాక్టర్స్ ఆమె ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఇక 1967 ఎన్నికల్లో ఇందిరాగాంధీకి డబుల్ ఛాలెంజ్ ఎదురైంది. కాంగ్రెస్ సీనియర్ నేతల సిండికేట్‌ను దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో సిండికేట్‌ ఓడిపోయింది. చాలా మంది నాయకులు ఎన్నికల్లో ఓడిపోయారు. ఇందిరా గాంధీ మాత్రం రాయ్‌బరేలీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, దాని సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది.

Advertisment
తాజా కథనాలు