Bangladesh : బంగ్లాదేశ్‌ అల్లర్ల వెనుక కుట్రకోణం ఉంది.. కమాండర్‌ కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌ అల్లర్ల వెనుక కుట్రకోణం దాగి ఉందని.. 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న వింగ్ కమాండర్ దేవేందర్ జీత్‌ సింగ్‌ క్లైర్‌ అన్నారు. విద్యార్థుల నిరసనలు ప్రపంచంలో ఇప్పటివరకు తీవ్ర రూపం దాల్చిన ఘటనలు లేవని.. ఈ హింసాత్మక ఘటనల వెనుక ఎవరైనా ఉండొచ్చన్నారు.

New Update
Bangladesh : బంగ్లాదేశ్‌ అల్లర్ల వెనుక కుట్రకోణం ఉంది.. కమాండర్‌ కీలక వ్యాఖ్యలు

Devender Jeet Singh Key Comments On Bangladesh Riots : బంగ్లాదేశ్‌ (Bangladesh) లో అల్లర్లు నెలకొన్న వేళ నోబెల్ గ్రహీత యూనస్ (Yunus) అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే బంగ్లాలో జరిగిన అల్లర్ల వెనుక కుట్రకోణం దాగి ఉందని.. 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న వింగ్ కమాండర్ దేవేందర్ జీత్‌ సింగ్‌ క్లైర్‌ (Devender Jeet Singh Kler) అన్నారు. విద్యార్థుల నిరసనలు ప్రపంచంలో ఇప్పటివరకు తీవ్ర రూపం దాల్చిన ఘటనలు లేవని.. ఈ హింసాత్మక ఘటనల వెనుక ఎవరైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Also Read : అంతిమ్‌ పంగల్‌పై నిషేధం.. క్లారిటీ ఇచ్చిన ఐవోఏ

ఆ అల్లరి మూకలే వీటిని కంట్రోల్ చేస్తోందని ఆరోపించారు. ఈ హింసాత్మక ఘటనలను సైన్యమే నియంత్రించగలదని.. వెంటనే కర్ఫ్యూ విధించి పరిస్థితులు అదుపులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వల్ల మొదలైన అల్లర్లు తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు నోబెల్ గ్రహీత యూనస్ అధ్యక్షతన 15 మందితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. గురువారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు