/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/student-jpg.webp)
Student Missing : రాజస్థాన్(Rajasthan) లోని కోటాలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యార్థులు అదృశ్యమవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలే కోచింగ్ హబ్(Coaching Hub) దగ్గర్లో ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. ఇప్పుడు తాజాగా మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన యువరాజ్ (18) అనే విద్యార్థి.. కోటా(Kota) లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో నీట్ పరీక్ష(NEET Exam) కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. శనివారం రోజున కోచింగ్ సెంటర్‌కు వెళ్లేందుకు యువరాజ్.. ఉదయం 7.00 గంటలకు హాస్టల్ నుంచి బయలుదేరాడు.
Also Read : గర్భిణీపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండగులు
అప్పటి నుంచి అతను కనిపించడం లేదు. మరో విషయం ఏంటంటే యువరాజ్ తన మొబైల్ ఫోన్‌ను కూడా హాస్టల్‌లోనే వదలేసి వెళ్లాడు. అయితే ఇటీవలే రచిత్ సొంధ్య అనే విద్యార్థి.. కోటా నుంచి అదృశ్యమైన వారం రోజుల తర్వాతే ఈ ఘటన జరగడం ఆందోళన రేపుతోంది. జేఈఈ కోచింగ్(JEE Coaching) తీసుకుంటున్న సొంధ్య కూడా హాస్టల్ నుంచి బయటికి వచ్చాక ఎవరికీ కనిపించకుండా పోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తే.. కోటాలోని ఓ క్యాబ్‌లో ఎక్కి వెళ్లినట్లు.. ఆ తర్వాత ఓ అటవి ప్రాంతంలోకి ప్రవేశించినట్లు కనిపించింది. గత సోమవారం సాయంత్రం పోలీసులు.. సొంధ్యకు సంబంధించిన బ్యాగ్, మొబైల్ ఫోన్, రూం తాళాలను గుర్తించారు. ఇప్పటికీ అతడి ఆచూకి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.
Also Read : వచ్చేసారి తెలంగాణలో బీజేపీదే అధికారం: జేపీ నడ్డా