Population: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు

భార‌త్‌లో 2060 నాటికి దేశ జ‌నాభా సుమారు 170 కోట్లు అవుతుంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నా వేసింది. ఆ త‌ర్వాత దేశ జ‌నాభా 12 శాతం ప‌డిపోతుంద‌ని చెప్పింది. ఈ శతాబ్దం మొత్తం ప్ర‌పంచంలో ఇండియానే అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశంగా నిలుస్తుంద‌ని యూఎన్ తెలిపింది.

Population: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు
New Update

India Population: 2024 ప్ర‌పంచ జ‌నాభాకు చెందిన నివేదిక‌ను ఐక్యరాజ్యసమితి రిలీజ్ చేసింది. జూలై 11న దీన్ని రిలీజ్ చేసింది. రాబోయే 50 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య‌.. ప్ర‌పంచ జ‌నాభా పెరుగుతూ పోతుంద‌ని, 2080 నాటికి ఆ జ‌నాభా సుమారు 1030 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని రిపోర్టులో తెలింది యూఎన్. అయితే 2080 త‌ర్వాత మ‌ళ్లీ జ‌నాభా త‌రుగుద‌ల మొద‌ల‌వుతుంద‌ని, ఈ శ‌తాబ్ధం చివ‌రి నాటికి ప్ర‌పంచ జ‌నాభా 1020 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని రిపోర్టులో అంచ‌నా వేశారు.

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశంగా గ‌త ఏడాది చైనాను ఇండియా దాటిన విష‌యం తెలిసిందే. అయితే ఆ పొజిష‌న్‌లోనే 2100 వ‌ర‌కు ఇండియా ఉంటుంద‌ని యూఎన్ రిపోర్టులో తెలిపారు. యూఎన్ పాపులేష‌న్ డివిజ‌న్‌కు చెందిన యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌నామిక్ అండ్ సొష‌ల్ అఫైర్స్ ఆ రిపోర్టును రూపొందించింది.

యూఎన్ రిపోర్టు ప్ర‌కారం 2024లో భార‌త్ జ‌నాభా 145 కోట్లుగా ఉంటుంది. ఆ త‌ర్వాత 2054 నాటికి జ‌నాభా సుమారు 169 కోట్లు చేరుకుంటుంద‌ని తెలిపారు. ఇక ఆ త‌ర్వాత 2100 నాటికి, భార‌త్ జ‌నాభా 150 కోట్ల‌కు త‌గ్గుతుంద‌ని యూఎన్ అధికారి క్లారి మెనోజి వెల్ల‌డించారు. అయితే 2060 స‌మ‌యంలో మాత్రం భార‌త జ‌నాభా తారా స్థాయికి చేరుకుంటుంద‌ని, ఆ త‌ర్వాత క్ర‌మంగా త‌గ్గ‌నున్న‌ట్లు చెప్పారు.

2024-54 మధ్య చైనా జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోదవుతుందని ఐరాస నివేదికలో పేర్కొంది. జపాన్‌, రష్యాల్లోనూ జనాభా వేగంగా దిగొస్తుందని తెలిపింది. ఐరాస నివేదిక అంచనా ప్రకారం 2024-54 మధ్య చైనా జనాభా 20 కోట్లు, జపాన్‌ జనాభా 2 కోట్లు, రష్యా జనాభా కోటి తగ్గనుంది. 2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితంకానుందని ఐరాస నివేదిక తెలిపింది.

#world #india #un #population
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe