AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత!

పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్‌ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.

AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత!
New Update

Pithapuram : పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని(Gold) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సరైన బిల్లులు కానీ, తీసుకుని వెళ్తున్న వ్యక్తుల వివరాలు కానీ సరిగా లేకపోవడంతో పాటు దానిని ఆక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఎస్‌ఎస్‌టీ(SST) అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనంలో సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్‌ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్‌ఎస్‌టీ బృందం తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో విశాఖ నుంచి కాకినాడ వస్తున్న సీక్వెల్‌ లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(Sequel Logistic Pvt. Ltd) సంస్థకు చెందిన వాహనం అనుమానస్పదంగా అనిపించింఇ.

వెంటనే వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టగా.. అందులో బంగారు, వెండి(Silver) వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారానికి సరైన కాగితాలు కానీ, తరలించే వ్యక్తులు పేర్లు కానీ సరి లేకపోవడంతో అధికారులు బంగారంతో పాటు వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు. ఏప్రిల్‌ 13న కూడా ఇదే తరహాలో రూ. 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also read: ఈ కాలంలో హీట్ స్ట్రోక్‌ కేసులే కాదు..బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి..జాగ్రత్త సుమా!

#politics #ap #sst #gold #seized
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి