IPL 2024: ఆర్‌సీబీ ఆటకు ఆ టీమ్ అభిమానులు ఇచ్చే బిల్డప్‌లకు అసలు పొంతన ఉండదు. ఒక్కసారి కూడా కప్‌లేదు కానీ చెన్నైతో ఫైట్‌ను ఎల్-క్లాసికోగా చెప్పుకుంటారు బెంగళూరు ఫ్యాన్స్. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 32 సార్లు తలబడితే చెన్నై ఏకంగా 21 సార్లు గెలిచింది. అయినా బెంగళూరు ఫ్యాన్స్ మాత్రం చెన్నైకి తామే పోటి అని భ్రమల్లో బతుకుతుంటారు. అటు చెన్నైని అందరి కంటే ఎక్కువసార్లు ఓడించిన ముంబై ఫ్యాన్స్ మాత్రం ఆర్‌సీబీ సోషల్‌మీడియా పోస్టులు చూసి నవ్వుకుంటారు. ఇప్పటివరకు ముంబై వర్సెస్ చెన్నై ఎన్‌కౌంటర్లలో ముంబైదే పైచేయి. అటు ఇద్దరికి సమానంగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ ఉన్నాయి. అందుకే ఈ రెండు జట్లతే ఐపీఎల్ అత్యుత్తమ పోరుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎల్-క్లాసికోకు అసలు అర్థం ఈ రెండు టీమ్‌ల మధ్య జరిగే టగ్ ఆఫ్ వారే. అటు బెంగళూరు అభిమానులు మాత్రం చెన్నైతో తలపడిన ప్రతీసారి బిల్డప్‌లకు పోతారు. తర్వాత ఓడిపోయాక సైలెంట్ అవుతారు. ఇక నిన్న చెపక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-17 ఎడిషన్ తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోరంగా ఆడి ఓడిపోయింది. ఇది చెపక్ స్టేడయంలో బెంగళూరుకు వరుసగా 8వ ఓటమి.
16ఏళ్ల నుంచి గెలుపే లేదు:
చెపక్ స్టేడియంలో చివరిసారిగా 2008 మే 21న చెన్నైపై ఆర్‌సీబీ గెలిచింది. ఆ తర్వాత అసలు గెలవనే లేదు. ఆర్‌సీబీ చివరిసారి చెపక్‌లో గెలిచిన సమయానికి సచిన్‌కు 81 సెంచరీలే ఉన్నాయి. ఆ తర్వాత సచిన్ 100 సెంచరీలతో రిటైర్ అయ్యాడు. సచిన్ రిటైరై 11ఏళ్లు అవుతుంది. ఇక చెపక్‌లో చివరిసారి ఆర్‌సీబీ గెలిచిన సమయానికి విరాట్ కోహ్లీ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టలేదు. ఇప్పుడు సచిన్ రికార్డులను కోహ్లీ బ్రేక్ చేసినంత సమయం గడిచినా ఆర్‌సీబీ మాత్రం చెపక్‌లో చెన్నైపై గెలవలేకపోయింది. ఇక చెపక్ పిచ్‌పై ఆర్‌సీబీ విక్టరీ సమయానికి అనిల్‌కుంబ్లే భారత్ జట్టు టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. లెజండరీ బౌలర్ జెమ్స్ అండర్సెన్ టెస్టు వికెట్ల సంఖ్య అప్పటికి 75 మాత్రమే.
ఇలా సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు చెపక్‌లో ఆర్‌సీబీ తలరాత మాత్రం మారలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. అనుజ్ రావత్, దీనేశ్ కార్తిక్ పోరాటంలో ఆర్‌సీబీ 173 రన్స్ చేయగలిగింది. అటు టార్గెట్ ఛేజింగ్‌లో చెన్నై ఆడుతూ పాడుతూ విక్టరీ కొట్టింది.
Also Read: ఇలా సింగిల్‌గా కప్‌లు గెలవడం మన వల్ల కాదు భయ్యా.. పొత్తులు పెట్టుకుంటే బెటర్!