Ananth Ambani-Radhika Merchant: అంబానీల ఇంట పెళ్ళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో వేడుకతో ముంబయ్ మారు మోగిపోతోంది. మరో రెండు రోజుల్లో పెళ్ళి జరగనుంది. దీని సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటూ జరగనున్న అనంత్-రాధికల పెళ్ళికి అంబానీ కుటుంబం భారీగా ఏర్పాట్లు చేశారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ సెంటర్ లో శుక్రవారం (జూలై 12) వివాహం జరగనుంది. దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు, వీవీఐపీ అతిధులు రానున్నారు.
అనంత్ అంబానీ-రాధికా పెళ్ళి వేడుకలు మార్చ నుంచి మొదలయ్యాయి. ఎంగేజ్ మెంట్, ప్రీ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్-2, సంగీత్, హల్దీ...ఇలా కొనసాగుతూ వస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో అనంత్ అం బానీ, రాధిక మర్చంట్ వివాహం జరిపేందుకు ముఖేష్ అంబానీ దంపతులు అత్యంత భారీ ఏర్పాట్లు చేశారు. పెళ్ళికి వచ్చే గెస్ట్‌ల కోసం మూడు పాల్కన్ 2000 జెట్ లు, 100కు పైగా విమానాలను రెంట్ కు తీసుకున్నారు.
ప్రత్యేక వంటకాలు...ప్రత్యేక రుచులు
ప్రీ వెడ్డింగ్‌కు అంబానీ ఫ్యామిలీ ఇచ్చిన విందు సూపర్ వైరల్ అయింది. ఇప్పుడు అంతకంటే విభిన్నంగా..మరిన్ని ఎక్కువ వంటకాలతో పెళ్ళి విందుకు రెడీ అయ్యారు ముఖేష్, నీతా అంబానీలు. వారణాసిలో ప్రసిద్ధిచెందిన కాశీ ఛాట్ భండార్ వ్యాపారులు వంటకాలు సిద్ధం చేస్తున్నారు. మెనూలో కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్ ఛాట్ లాంటి స్పెషల్స్ ను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. వీటిని కాశీ ఛాట్ బండార్ ఓనరే స్వయంగా అతిధులకు వడ్డించనున్నారు. ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో 2వేల 5 వందల రకాల రుచులతో భోజనాలు పెట్టిన అంబానీ ఫ్యామిలీ.. ఇప్పుడు పెళ్ళిలో 3 వేల ప్రత్యేక వంటకాలను అతిథులకు వడ్డించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. కేవలం భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మొత్తం పెళ్ళి ఖర్చు విషయానికి వస్తే...ప్రీ వెడ్డింగ్ వేడుకలకే దాదాపు 1260 కోట్లు ఖర్చు చేశారని అంచనా.. పెళ్లి జరిగే నాటికి ఓ 15 వందల కోట్లు ఖర్చు పెట్టనుందని అంచనా. అంతు ముందు ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్ళికి 700 కోట్లు ఖర్చుపెట్టారు.