TicTok Star: సెల్ఫీలు తీసుకుంటూ.. జలపాతంలో పడిన టిక్‌టాక్‌ స్టార్‌!

మయన్మార్‌ కు చెందిన టిక్‌టాక్‌ స్టార్‌ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది.

New Update
TicTok Star: సెల్ఫీలు తీసుకుంటూ.. జలపాతంలో పడిన టిక్‌టాక్‌ స్టార్‌!

TicTok Star: మయన్మార్‌ కు చెందిన టిక్‌టాక్‌ స్టార్‌ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది. నీటి ప్రవాహం నుంచి బయటకు వచ్చేందుకు ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. రంగంలోకి దిగి అతి కష్టం మీద బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. తాళ్ల సాయంతో డెడ్‌ బాడీని పైకి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇటీవల ముంబైకి చెందిన ట్రావెల్ డిటెక్టివ్ ఆన్వీ కామ్‌దార్ కూడా మహారాష్ట్రలోని కుంభే జలపాతంలో పడి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ టూరిస్టు స్థలాలను పరిచయం చేస్తూ ఉండేది. తన స్నేహితులతో జలపాతాన్ని చూస్తూ.. కాలు జారి బండ సందుల్లో పడి ప్రాణాలు వదిలింది.

Also read: వయనాడ్‌ లో గల్లంతైన ఆ 600 మంది కార్మికులు ఎక్కడ..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు