Patanjali : పతంజలి నుంచి 14 రకాల వస్తువులు బ్యాన్.. రాందేవ్ బాబా నిర్ణయం

రాందేవ్ బాబా కంపెనీ అయిన పతంజలి ప్రోడక్ట్స్‌పై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన యాడ్స్ విషయంలో సుప్రీంకోర్టు సైతం రాందేవ్‌ బాబా, పతంజలి డైరెక్టర్ బాలకృష్ణకు చివాట్లు పెట్టింది. ఈ క్రమంలో  14 ప్రొడక్ట్‌ని ఆపేస్తున్నట్టు రాందేవ్ బాబా ప్రకటించారు.

New Update
Patanjali : పతంజలి నుంచి 14 రకాల వస్తువులు బ్యాన్.. రాందేవ్ బాబా నిర్ణయం

14 Types Of Products Ban From Patanjali - Ramdev Baba : పతంజలి వస్తువులు (Patanjali Products) ఈమధ్య బాగా వివాదాలు గురవుతున్నాయి. సంస్థకు చెందిన కొన్ని వస్తువుల తయారీ లైసెన్స్‌లను ఉత్తరాఖండ్ (Uttarakhand) సర్కార్ ఇప్పటికే రద్దు చేసింది. వాటి తాలూకా వివరాలను సుప్రీంకోర్టు (Supreme Court) కు కూడా అందించింది. దాంతో పాటూ పతంజలి యాడ్స్ మీద కూడా సుప్రీంకోర్టు మండిపడింది. మరోవైపు కేరళ కోర్టులో కూడా పతంజలి ప్రాడక్ట్స్, రాందేవ్ బాబా (Ramdev Baba) ల మీద కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే 14 రకాల ఉత్పత్తులను అమ్మడం ఆపేస్తున్నట్టు తాజాగా పతంజలి సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మొత్తం వస్తువుల లిస్ట్‌ వివరాలను వెల్లడించింది.

దాంతో పాటూ దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు సూచనలు చేసింది. స్టోర్లలో ఉన్న ఆ 14 రకాల ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పింది. ఇక పతంజలి బంద్ చేసిన ప్రాడక్ట్స్ 14 ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్‌ను కూడా నిలిపివేయాలని మీడియా సంస్థలకు కడా పతంజలి యాజమాన్యం సూచించింది. దాంతో పాటూ పతంజలి బ్యాన్డ్ ప్రాడక్ట్స్‌ను తిరిగి వెనక్కు పంపించేయాలని స్టోర్లకు సూచించింది.

పతంజలి రద్దు చేసిన 14 రకాల ఉత్పత్తులు
దృష్టి ఐ డ్రాప్
స్వసరి గోల్డ్
స్వసరి వాటి
బ్రొన్‌కమ్
స్వసరి ప్రవాహి
స్వసరి అవాలెహ్
ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్
లిపిడామ్
బీపీ గ్రిట్
మధుగ్రిట్
మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్
లివమ్రిత్ అడ్వాన్స్
లివొగ్రిట్
ఐగ్రిట్ గోల్డ్

కోర్టు ఆగ్రహం..
అంతకు ముందు తప్పుడు ప్రకటనలు చేసినందుకు పతంజలి ఉత్పత్తుల యాడ్స్ పై సుప్రీం కోర్టు పూర్తిగా నిషేదం విధించింది. గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ మళ్లీ అలాంటి యాడ్స్‌ను ప్రచారం చేడం మీద కోర్టు మండిపడింది. ఈ మేరకు పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలకు ధిక్కార నోటీసులను పంపించింది. పతంజలి పై కోర్టు దిక్కార పిటిషన్‌ మీద సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆయుర్వేద సంస్థ వ్యస్థాపకుల్లో ఒకరైన రామ్‌దావ్‌ బాబాతో పాటూ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కూడా కోర్టుకు హాజరు కావాలని సమన్లను జారీ చేసింది.

అసలు కేసు ఏమిటి?
ఫిబ్రవరి 27న, రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, ఊబకాయం వంటి ఇతర వ్యాధుల కోసం పతంజలి ఆయుర్వేదం ఉత్పత్తి చేసే మందుల ప్రకటనలను ప్రచురించకుండా సుప్రీంకోర్టు నిషేధించింది. పతంజలి ఆయుర్వేదం, ఆచార్య బాలకృష్ణలపై ధిక్కార నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2023లో, మెడికల్ ఎఫిషియసీ గురించి లేదా ఔషధ వ్యవస్థను విమర్శించడం గురించి ఎలాంటి ప్రకటనలు లేదా నిరాధారమైన వాదనలు చేయబోమని కంపెనీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. కానీ కంపెనీ తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది.

Also Read:Tirupathi: సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేకు రూ. 50 లక్షల టోకరా

Advertisment
తాజా కథనాలు