Rajasthan Shivaratri Incident : మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన రాజస్థాన్(Rajasthan) లో విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ కోటలో మహాశివరాత్రి ఊరేగింపు జరుగుతున్న సమయంలో 14 మంది చిన్నారులు కరెంట్ షాక్(Current Shock) కు గురయ్యారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్న హైటెన్షన్ వైర్ల వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. అలాగే.. కార్యక్రమం నిర్వహణలో సేఫ్టీ చర్యలు తీసుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యం గా వ్యవహరించడం కూడా ఈ ప్రమాదానికి కారణం అయిందని వారు తెలిపారు.
Also Read : విశాఖలో విషాదం..తండ్రి చనిపోయినా వెనకడుగు వెయ్యని విద్యార్థిని..!
విషమంగా ఇద్దరు పిల్లల..
ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్(Heera Lal Nagar) కరెంట్ షాక్ తగిలి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను ప్రరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి పండుగ వేళ ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం అని అన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. కరెంట్ షాక్ తగలడం వల్ల ఆ ఇద్దరి పిల్లల శరీరాలు 100 శాతం కాలిపోయాయని అన్నారు. వారిని క్రిటికల్ వార్డులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ విషాద సంఘటనపై విచారణకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
అందులో ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉందని రాజస్థాన్ వైద్యారోగ్య శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు.
Also Read : హనుమకొండ జిల్లాలో దారుణం.. విద్యార్థిని సూసైడ్