చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేయవద్దు..' ఇది ఈ కాలం అమ్మాయిల మాట. 'పెళ్లి చేస్తేనా చదువుకుంటా..' ఇది పాకిస్థాన్‌లోని ఓ టీనేజ్ గర్ల్ మాట. తనకు పెళ్లి చేయకపోతే చదువకునేదే లేదని తెగెసి చెప్పింది. నిజానికి పాకిస్థాన్‌లో అమ్మాయికి పెళ్లికావలంటే 16ఏళ్లు నిండాలి. ఈ అమ్మాయికేమో 12ఏళ్లే. అయినా కూడా పెళ్లి కావాల్సిందేనని పేరెంట్స్‌కు అల్టిమేటం జారీ చేసింది. దీంతో తల్లిదండ్రులు తల పట్టుకోవాల్సి వచ్చింది.. చేసేదేం లేక ఓ అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేసింది. ఇక్కడ మరో విడ్డూరం ఏంటంటే ఆ అబ్బాయి ఏజ్ 13ఏళ్లే. ఇది కూడా పాకిస్థాన్ రూల్స్ ప్రకారం చట్టవిరుద్ధం. అయినా కూడా పాకిస్థాన్ కదా .. ఇలాంటి వింతలు, విడ్డూరాలు, విశేషలు అక్కడ కొత్తేమీ కాదు.
13 ఏళ్ల అబ్బాయి, 12 ఏళ్ల అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్న ఆశ్చర్యకరమైన విషయం పాకిస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్ల నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోని సమాచారం ప్రకారం వీడియోలో ఉన్న అమ్మాయి తన కుటుంబానికి అల్టిమేటం జారీ చేసింది. పెళ్లి చేస్తేనే తన చదువును కొనసాగిస్తానని చెప్పింది. దీంతో ఇరు కుటుంబాలు తమ పిల్లల పెళ్లికి అంగీకరించి ఘనంగా నిశ్చితార్థం చేసినట్టు సమాచారం.
ఇంత చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేశారన్న వార్త నెటిజన్లకు కోపం వచ్చేలా చేసింది.
Also Read: ఏనుగుతోనే ఆటలా? తొండంతో తంతే ఎగిరి ఎక్కడో పడింది.. పాపం!
WATCH THIS YOUTUBE TRENDING VIDEO: Bhimaa - Official Trailer