/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CHICK-jpg.webp)
Maharashtra : మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai) లో విషాదం చోటుచేసుకుంది. చికెన్ షావర్మా(Chicken Shawarma) తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్‌లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 12 మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Also Read: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది తొమ్మిదో ఘటన
అయితే వీళ్లలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. మరో ముగ్గురు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్(Food Poisoning) వల్లే వీళ్లు అస్వస్థకు గురై ఆసుపత్రిలోకి చేరినట్లు అధికారులు తెలిపారు.
Also Read: రిజర్వేషన్ల రద్దు మీద హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో..కేసులు నమోదు