Nigeria : వర్షాలకు దెబ్బతిన్న జైలు గోడలు.. 118 మంది ఖైదీలు పరార్‌!

వర్షాల వల్ల నైజీరియాలోని ఓ జైలు గోడలు దెబ్బతినడంతో సుమారు 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో  రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీ గోడలతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.

Nigeria : వర్షాలకు దెబ్బతిన్న జైలు గోడలు.. 118 మంది ఖైదీలు పరార్‌!
New Update

Rains : వర్షాల వల్ల నైజీరియా(Nigeria) లోని ఓ జైలు గోడలు(Prison Walls) దెబ్బతినడంతో సుమారు 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో  రాత్రి భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీ గోడలతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.

దీన్నే అదనుగా భావించిన 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారైనట్లు జైలు అధికారులు తెలిపారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని, వారిలో ఇప్పటివరకు 10 మందిని పట్టుకోగలిగామని చెప్పారు. మిగిలినవారి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని తెలిపారు. అయితే తప్పించుకున్నవారు ఎవరనే విషయాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. గతంలో ఇదే జైలులో బోకో హరమ్‌ గ్రూప్‌ సభ్యులను బంధించారు. పరారైనవారిలో వారు కూడా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నైజీరియా జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఉగ్రవాదుల దాడులు(Terrorists Attack), వసతుల లేమి కారణంగా ఈ మధ్యకాలంలో దేశంలోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయిన ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.

Also read: కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ..కారు డ్రైవర్‌ మీదే అనుమానం!

#rains #nigeria #escape #prision
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe