Telangana: 117 గ్రామాలకు రాకపోకలు బంద్‌!

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. పలు జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడం వల్ల సుమారు 117 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.

Mumbai Rains: ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన
New Update

Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. తెలంగాణలోని చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రహదారులు కొట్టుక‌పోవ‌డంతో.. ఎక్కడికక్కడ రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఇప్పటి వ‌ర‌కు అందిన ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు 117 గ్రామాల‌కు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి.

రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 33 గ్రామాలకు వెళ్లే ర‌హ‌దారులు దెబ్బతిన‌గా.. క‌రీంన‌గ‌ర్‌లో 20 గ్రామాల రోడ్లు పూర్తిగా పాడవ్వడంతో సంబంధాలు కట్‌ అయ్యాయి. మ‌హ‌బూబాబాద్లో 30గ్రామాలు, ఉమ్మడి మెద‌క్‌లో 8 గ్రామాల‌కు, నిజామాబాద్‌లో 7 గ్రామాలకు, న‌ల్గొండలో 4 గ్రామాల‌కు వెళ్లే ర‌హ‌దారులు కొట్టుకుపోయాయి.ఇప్పటి వ‌ర‌కు కింది స్థాయి నుంచి అందిన స‌మాచారం మేర‌కు మొత్తం 117 గ్రామాల‌కు రాక‌పోక‌లు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి.

Also Read: మరికొన్ని రైళ్లు రద్దు…రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ దారి మళ్లింపు!

#telangana #rains #telangana-rains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి