Rain Effect: మరికొన్ని రైళ్లు రద్దు...రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు! తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇప్పటికే 30 కి పైగా రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దారిని మళ్లించినట్లు తెలిపారు. By Bhavana 02 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే 30 కి పైగా రైళ్లను రద్దు చేసిన అధికారులు..తాజాగా మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ ను కూడా అధికారులు రద్దు చేశారు. Bulletin No.26: SCR PR No.348, Dt.02.09.2024 on "Diversion of Trains due to Heavy Rains" pic.twitter.com/hJAc2xGySI — South Central Railway (@SCRailwayIndia) September 2, 2024 విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ను భీమవరం మీదుగా దారి మళ్లించారు. ట్రాక్ లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాజీపేట, రాయనపాడులో ట్రాక్ లు తెగిపోవడంతో రైళ్లు నిలిపివేశారు. ఆదివారం, సోమవారం కలిపి మొత్తంగా 80 రైళ్లు రద్దు చేయగా, మరో 48 రైళ్లను దారి మళ్లించారు. హైదరాబాద్-విజయవాడ రూట్ లోనే అత్యధిక రైళ్లు రద్దయ్యాయి. మరో వైపు పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. Bulletin No.22,23.24 & 25 - SCR PR No.347 - Cancellations/Partial Cancellations/Diversions pic.twitter.com/SBLjJg8kIT — South Central Railway (@SCRailwayIndia) September 2, 2024 Also Read: ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను! #telangana-rains #ratnachal-express #andhra-pradesh-rains #trains #trains-cancelled #south-central-railway మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి