TS SSC Supplementary Exam Dates: తెలంగాణలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఉదయం 9.30 AM గంటల నుంచి 12.30 AM గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే రీకౌంటింగ్‌కు కూడా 15 రోజుల వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక సబ్జెక్టుకు రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఆన్సర్ షీట్ కాపీ కోసం రూ.1000 చెల్లించాలని తెలిపారు.
Also read: యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తాం- అమిత్ షా
ఇదిలాఉండగా.. ఈసారి పదవ ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత కాగా.. ఆరు పాఠశాలలో సున్నా ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది.
Also Read: టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. హైదరాబాద్-విజయవాడ రూట్ ప్రయాణికులకు భారీ ఆఫర్!