తెలంగాణ(Telangana) లో పదో తరగతి పరీక్ష ఫలితాలు(Tenth Class Exams Results) విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ లో చూసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదే తరగతి పరీక్షలు జరిగాయి.
Also Read: టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. హైదరాబాద్-విజయవాడ రూట్ ప్రయాణికులకు భారీ ఆఫర్!
ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీళ్లలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పేపర్ కరెక్షన్ ప్రక్రియ ఏప్రిల్ 13 నాటికి పూర్తయింది. ఇదిలాఉండగా ఇటీవలే రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.
Also Read: ఘోర ప్రమాదం..పెళ్లి ఊరేగింపు పై పడిన ట్రక్కు.. 6 గురు మృతి!