Andhra Pradesh : పదవ తరగతి హాల్‌ టికెట్లు నేటి నుంచి విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి హాల్‌టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా.. మార్చి 18 నుంచి 30 వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.

New Update
TS Tenth Exams: టెన్త్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే స్టూడెంట్స్ కు రేవంత్ సర్కార్ శుభవార్త.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు నుంచి హాల్‌టికెట్లు విడుదల(Hall Tickets Released) కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Board Of Secondary Education) అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే మార్చి 18 నుంచి 30 వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో 7 లక్షల 25 వేల మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 3,473 సెంటర్లు సిద్ధం చేశారు.

Also Read : తల్లిదండ్రులపై మృగంలా ప్రవర్తించిన కొడుకు.. కన్నతల్లి గుండెలపై తన్ని..

వీళ్లలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షల మంది ఉండగా.. మరో లక్ష మంది గత ఏడాది పరీక్ష తప్పి మళ్లీ రెగ్యులర్‌ విధానంలో రాస్తున్నవాళ్లు. పదవ తరగతి పరీక్షలు(Xth Class Exams) పగడ్బందీగా నిర్వహించేందుుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లను సిద్ధం చేశారు. అలాగే 130 కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పేరు, పుట్టిన తేదీ స్కూల్, జిల్లా వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. పదవ తరగతి పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల్నించి మద్యాహ్నం 12.45 గంటల వరకూ జరగనున్నాయి.

పరీక్ష షెడ్యూల్‌ ఇదే..

మార్చి 18 - ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20 - ఇంగ్లిష్
మార్చి 22 - మ్యాథ్స్‌
మార్చి 23 - ఫిజికల్ సైన్స్
మార్చి 26 - బయాలజీ
మార్చి 27 - సోషల్ స్టడీస్
మార్చి 28 - ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1 పరీక్ష ఉంటుంది
మార్చి 30 - ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), ఓకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుంది

Also Read : వైసీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన సీఎం జగన్

Advertisment
Advertisment
తాజా కథనాలు