Indo -China Border: భారత్ - చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టివేత..

భారత్ - చైనా సరిహద్దులోని తూర్పు లడఖ్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకున్నాయి. ఆ ప్రాంతంలో ఇంత భారీగా బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారి.

New Update
Indo -China Border: భారత్ - చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టివేత..

భారత్ - చైనా సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. తూర్పు లడఖ్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం తూర్పు లడఖ్‌లో ఇండో - టెబెటన్ సరిహద్దు పోలీసు (ITBP) బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. అయితే స్మగ్లింగ్ గురించి సమాచారం అందటంతో బలగాలు.. అక్కడ అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించారు.

Also read: వాళ్లకు రుణమాఫీ బంద్.. రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

వాళ్ల లగేజ్‌ను తనిఖీ చేయగా.. 108 కిలోల బంగారు కడ్డీలు లభించాయి. అలాగే రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైనాక్యులర్, రెండు కత్తులు, చైనాకు చెందిన కొన్ని ఆహారం పదార్థాలు దొరికాయి. వీటన్నింటినీ బలగాలు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురుని అరెస్టు చేశాయి. నిందితుల్లో ఇద్దరు లడఖ్‌లోని న్యోమా ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఇంత భారీగా బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారి.

Also Read: ఆర్టీసీలో 3035 ఉద్యోగాలపై సజ్జనార్ కీలక ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు