MP: కొత్త ఎంపీల్లో ఇంతమంది ఇంటర్‌ లోపే చదివారా?

దేశ వ్యాప్తంగా మంగళవారం వెలువడిన లోక్‌ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎంపీల విద్యార్హతల వివరాలను ఏడీఆర్‌ రిపోర్ట్ వివరించింది. పూర్తి వివరాల కోసం.. ఈ కథనం చదివేయండి..!

MP: కొత్త ఎంపీల్లో ఇంతమంది ఇంటర్‌ లోపే చదివారా?
New Update

MP: దేశ వ్యాప్తంగా మంగళవారం వెలువడిన లోక్‌ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎంపీల విద్యార్హతల వివరాలను ఏడీఆర్‌ రిపోర్ట్ వివరించింది.
ఈసారి మొత్తం 543 మంది ఎంపీలు లోక్‌సభలో అడుగుపెట్టనుండగా.. అందులో 19 శాతం (105) మంది 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే చదివారని నివేదిక తెలిపింది.

ఇందులో ఇద్దరు 5వ తరగతి వరకు, నలుగురు 8వ తరగతి, 34 మంది 10వ తరగతి వరకు, 25 మంది 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారని తెలిపింది. ఇక 420 మంది (77 శాతం) గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారని పేర్కొంది. నూతన ఎంపీల్లో 17 మంది డిప్లొమా చేశారని, ఒక ఎంపీ అయితే కొద్దిపాటి అక్షరాస్యుడు మాత్రమేనని ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది. కాగా లోక్‌‌సభ ఎన్నికలలో మొత్తం 121 మంది నిరక్షరాస్యులు పోటీ చేయగా వారందరూ ఓటమి పాలయ్యారు.

కాగా పీఆర్ఎస్ అనే మేధో సంస్థ లెజిస్లేటివ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. కొత్తగా గెలిచిన ఎంపీలకు వ్యవసాయం, సామాజిక సేవ సాధారణ వృత్తులుగా ఉన్నాయని విశ్లేషించింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌ ఎంపీల్లో 72 శాతం, గుజరాత్‌ , ఛత్తీస్‌గఢ్‌ ఎంపీల్లో 91 శాతం, నుంచి గెలిచిన ఎంపీల్లో 65 శాతం మందికి వారి వృత్తుల్లో వ్యవసాయం ఒకటిగా ఉందని సమాచారం

ఇక ఎంపీలలో 7 శాతం మంది లాయర్లు, 4 శాతం మంది వైద్యులు ఉన్నారని వివరించింది.

Also read: హైదరాబాద్‌ లో భారీ వర్షం…జలమయమైన రహదారులు!

#mp #national #education #politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి