Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..పూర్తి వివరాలివే..!! బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పంజాబ్ బ్యాంక్ లో 1025 స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పీఎన్బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1025 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. By Bhoomi 16 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Jobs: బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పంజాబ్ బ్యాంక్ లో 1025 స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పీఎన్బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1025 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. ఇందులో ఆఫీసర్ క్రెడిట్ వెయ్యి పోస్టులు, మేనేజర్ ఫారెక్స్ 15పోస్టులు, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5 పోస్టులు, సీనియర్ మేనేజ్ సైబర్ సెక్యూరిటీ 5పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హతలు: పోస్టులను బట్టి బీఈ, బీటెక్,ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఎ, సీఎంఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం కూడా ఉండాలి. వయస్సు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 30ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ 35ఏళ్లు, మేనేజర్ కు 38ఏళ్లు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 42ఏళ్లు మించకూడదు. జీత భత్యాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు రూ. 36వేల నుంచి 63వేలు, డిప్యూటీ మేనేజర్ కు రూ. 48వేల నుంచి 69వేలు, మేనేజర్ కు రూ. 63వేల నుంచి 78వేలు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కు రూ. 89, లక్షల వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ. 750 ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు మినహాయింపు ఉంది. ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్ లైన్ ద్వారా ఉంటుంది. చివరి తేదీ 04-03-2024 వరకు ఉంది. ఇది కూడా చదవండి: పేటీఎంకు పెరుగుతున్న కష్టాలు.. ఈ బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ లు కొనుగోలు చేయాలన్న NHAI..!! #jobs #latest-jobs #jobs-update మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి