RTC: సంక్రాంతి రికార్డును బ్రేక్‌ చేసిన ఆర్టీసీ.. మూడు రోజుల్లోనే ఎంతమంది ప్రయాణించారంటే!

సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్‌ ఆర్టీసీ సంక్రాంతి రికార్డును బ్రేక్‌ చేసింది. జనవరి లో సంక్రాంతి పండగ సమయంలో 10 శాతానికి పైగా ప్రయాణికలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఈ నెల 9 నుంచి 11 వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వివరించారు.

RTC: సంక్రాంతి రికార్డును బ్రేక్‌ చేసిన ఆర్టీసీ.. మూడు రోజుల్లోనే ఎంతమంది ప్రయాణించారంటే!
New Update

సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్‌ ఆర్టీసీ సంక్రాంతి రికార్డును బ్రేక్‌ చేసింది. జనవరి లో సంక్రాంతి పండగ సమయంలో 10 శాతానికి పైగా ప్రయాణికలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఈ నెల 9 నుంచి 11 వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వివరించారు.

ఇక ఏపీకి 59,800 మంది ప్రయాణించారని తెలిపారు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఏపీకి ఇప్పటివరకు టీఎస్ నుంచి 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టింది. ఆ బస్సుల్లో దాదాపు 3 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు కోరారు. అలాగే, హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడుపుతున్నట్లు సమాచారం.

ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించింది. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రయాణికులను ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కోరింది.

Also read: సిరా గుర్తు తెచ్చిన చిక్కు..తొమ్మిదేళ్లు అయినా చెరగని ఇంక్‌ మార్క్‌!

#journey #elections #ap #vote #ts-rtc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe