Gold And Silver Rates Today: తగ్గేదే లేదంటూ అంతకంతకూ పైపైకి ఎగబాకుతున్నాయి పసిడి, వెండి ధరలు. 10గ్రాముల మేలిమి బంగారం 75 వేలకు చేరింది. దాంతో పాటూ 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ 67వేలకు చేరింది. వినియోగదారులు కొన్నాకొనకపోయినా ధరలు పెరుగుదలలో మాత్రం తగ్గుదల ఉండటం లేదు. మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి 85వేలకు చేరుకుంది. ఏ రోజుకారోజు ఆల్ టైమ్ హైకి గోల్డ్, సిల్వర్ రేట్స్ చేరుకుంటున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అక్కడ ఔన్స్ బంగారం ధర 2,429 డాలర్లు పలుకుతోంది.
బాబోయ్ ఎంతలా పెరిగాయో..
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 16 శాతం గోల్డ్ రేట్ పెరిగింది. ఈ ఏడాది జనవరి 1న 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.65,200రూ. లు ఉంటే 4నెలలు కూడా గడవకముందే 10వేలు పెరిగింది. నిన్నటికి ఇవాల్టికి అయితే ఒక్కరోజులోనే 1000రూ.లు పెరిగి కూచుంది. అంతర్జాతీయంగా గోల్డ్ రేట్స్ పెరుగుతుండటం.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాలు రావడంతోనే పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటూ మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్లు, పలు దేశాల మధ్య యుద్ధాలు కూడా వీటి ప్రభావం చూపిస్తున్నాయి. ఇక పలు దేశాలు భారీగా బంగారం కొనుగోళ్లు కూడా చేస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరల పెరుగుదలకు కారణమంటున్నారు విశ్లేషకులు.అయితే ఈ పరిస్థితులను భారత్‌తో సహా మరికొన్ని దేశాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ముందు చూపుతో బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. కానీ సామాన్య జనం మాత్రం తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అంతకంతకూ పెరుగుతూ పోతే ఎలా కొంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం పెళ్ళిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
Also Read: CSDS Survey: ఎన్నికల సంఘంమీద నమ్మకం తగ్గింది..సీఎస్డీఎస్ సర్వేలో సంచలన విషయాలు