Heath Streak: దిగ్గజ క్రికెటర్ హిత్ స్ట్రీక్ ఇక లేరు...!

జింబాంబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రిక్ ఇక లేరు. క్యాన్సర్ తో పోరాడుతూ మంగళ వారం ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా పేగు, కాలేయ సంబంధ క్యాన్సర్ తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హీత్ స్ట్రీక్ మరణంపై ఆయన సహచర ఆటగాడు, జింబాంబ్వే ప్రస్తుత కెప్టెన్ హెన్రీ ఒలంగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

author-image
By G Ramu
Heath Streak: దిగ్గజ క్రికెటర్ హిత్ స్ట్రీక్ ఇక లేరు...!
New Update

Heath Streak passes away: జింబాంబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రిక్ ఇక లేరు. క్యాన్సర్ తో పోరాడుతూ మంగళ వారం ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా పేగు, కాలేయ సంబంధ క్యాన్సర్ తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హీత్ స్ట్రీక్ మరణంపై ఆయన సహచర ఆటగాడు, జింబాంబ్వే ప్రస్తుత కెప్టెన్ హెన్రీ ఒలంగా (Henry Olonga) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

హీత్ స్ట్రీక్ (Heath Streak) మరణించారన్న తీవ్ర విషాద వార్త అందుతోందన్నారు. జింబాంబ్వే (Zimbabwe) క్రికెట్ లెజెండ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. స్ట్రీక్ తో కలిసి ఆడటం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. మరో ఆటగాడు సీన్ విలియమ్స్ కూడా ట్వీట్ చేశారు. ‘మీరు, మీ కుటుంబ సభ్యులు నాకు ఎంత సహాయం చేశారో చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదన్నారు.

జింబాబ్వేలోని అత్యుత్తమ క్రికెటర్లలో హిత్ స్ట్రీక్స్ ఒకరు. 1993లో పాక్ తో జరిగిన టెస్టు మ్యాచ్ తో ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ సిరీస్ లో రవల్పిండిలో జరిగిన రెండో మ్యాచ్ లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టి సత్చా చాటారు. 2000 నుంచి 2004 మధ్య జింబాంబ్వే జట్టుకు ఆయన కెప్టెన్ గా వ్యవహరించారు. సుమారు 12 ఏండ్ల పాటు ఆయన జింబాంబ్వే జట్టుకు సేవలందించారు.

ఆయన మొత్తం 65 టెస్టు మ్యాచ్ లు, 189 వన్డే మ్యాచ్ లు ఆడారు. ఎన్నో మ్యాచ్ ల్లో జింబాంబ్వేకు ఆయన ఒంటి చేత్తో విజయాలు సాధించి పెట్టారు. జింబాంబ్వే తరఫున టెస్టుల్లో 100 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్ గా ఆయన రికార్డు సృష్టించారు. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గా టెస్టుల్లో 1990 పరుగులు, వన్డేల్లో 2943 పరుగులు చేశారు. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోర్ 127 (నాటౌట్) విండీస్ జట్టుపై చేశారు.

Also Read: క్రికెట్ దేవునికి కీలక పదవి…. నేషనల్ ఐకాన్ గా నియమించిన ఎన్నికల సంఘం…!

#passed-away #captain #heath-streak #zimbambwe #henry-olanga #all-rounder #heath-streak-passes-away #zimbabwe-cricket-legend-heath-streak-passes-away #heath-hilton-streak #heath-streak-dies-at-49
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe