Zika Virus In Pune : మహారాష్ట్ర (Maharashtra) లోని పుణెలో జికా వైరస్ (Zika Virus) కలకలం రేపుతోంది. వైరస్ విజృంభిస్తుండడంతో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య విభాగం (Health Department) అప్రమత్తం అయ్యింది. వైరస్ వ్యాప్తి నివారణకు పుణె మున్సిపల్ అధికారులు చర్యలు మొదలు పెట్టారు.
జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలో మొదటి కేసు నమోదయినట్లు అధికారులు తెలిపారు. 46 సంవత్సరాల డాక్టర్ తొలుత జికా వైరస్ బారినపడ్డారు. అనంతరం అతని కుమార్తె (15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్దారణ అయ్యింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరు రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నలుగురితో పాటు అరంద్వానేకు చెందిన మరో ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Also read: రేపు ఢిల్లీకి రానున్న టీమిండియా..చార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు!