Siddique : పది కేజీలు తగ్గితేనే కలుస్తానన్నాడు.. రాహుల్ గాంధీపై జీషాన్ విమర్శలు!

రాహుల్ గాంధీపై మహారాష్ట్ర నాయకుడు జీషాన్ సిద్ధిఖీ తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్ నాందేడ్‌ వచ్చినప్పుడు తనకు కలిసే అవకాశం ఇవ్వలేదన్నారు. 10 కిలోల బరువు తగ్గితేనే రాహుల్ కలవమన్నారని ఆయన సన్నిహితులు చెప్పడం ఆశ్చర్యమేసిందన్నారు.

Siddique : పది కేజీలు తగ్గితేనే కలుస్తానన్నాడు.. రాహుల్ గాంధీపై జీషాన్ విమర్శలు!
New Update

Mumbai : కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై మహారాష్ట్ర నాయకుడు బాబా సిద్ధిఖీ తనయుడు జీషాన్ సిద్ధిఖీ(Zeeshan Siddique) సంచలన కామెంట్స్ చేశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్ తన పట్ల వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించిందన్నారు. నిజంగా రాహుల్ ఇలాంటి మనస్తత్వం కలిగివుంటాడని ఊహించలేదంటూ విమర్శలు గుప్పించారు.

కలవాలంటే బరువు తగ్గాలా?

ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న బాబా సిద్ధిఖీ ఇటీవల ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి.. అజిత్ పవార్(Ajith Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీ(NCP) లో చేరిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఓ కార్యక్రమంలో జీషాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ ‘భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) లో భాగంగా రాహుల్ గాంధీ మహారాష్ట్ర(Maharashtra) లోని నాందేడ్‌ వచ్చారు. అయితే అదే సమయంలో నేను రాహుల్‌తో భేటీ కావాలనుకున్నా. కానీ 'రాహుల్ ను కలవాలంటే నీవు 10 కేజీల బరువు తగ్గాలి' అని ఆయన సన్నిహితులు నాతో అన్నారు. నిజంగా నేను ఒక రకంగా బాధగానే కాదు అవమానంగానూ ఫీల్ అయ్యాను. కానీ ఆ క్షణం ఎవరితో చెప్పుకోలేక మనసులోనే బాధను దాచుకున్నా' అంటూ జీషాన్ వివిరించారు.

ఇది కూడా చదవండి: Mole: అమ్మాయిలకు అక్కడ పుట్టుమచ్చలు ఉంటే.. పట్టిందల్లా బంగారమే

అలాగే కాంగ్రెస్‌ నాయకులు మైనార్టీలు, కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరు చాలా బాధకరమంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా వుంటే.. ఇటీవల తాజాగా ముంబై యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి జీషాన్‌ సిద్ధిఖీను కాంగ్రెస్ అధిష్ఠానం తొలగించింది. అయితే తనపై చర్యల విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని ఆయన తెలిపారు.

#zeeshan-siddiqui #maharashtra #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe