YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి కారణం ఇదే.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు.!

షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై వైవీ సుబ్బా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిందని.. అయితే, అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేశారు.

New Update
YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి కారణం ఇదే.. వైవీ సుబ్బారెడ్డి  కీలక వ్యాఖ్యలు.!

YV Subba Reddy on Sharmila: అనకాపల్లి జిల్లా సత్యనారాయణపురం లో టిడ్కో ఇళ్లను ప్రారంభించారు వైసీపీ రీజనల్ కోర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి. లబ్ది దారులకు ఇళ్లను అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లో (YSRCP) అవకాశం లేకే షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టుందని అన్నారు. అయితే, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ (Congress) లో విలీన చేసేందుకు నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేశారు.

Also Read: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఎట్టకేలకు బేబీ బంప్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ

షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం ఉందని అన్నారు. షర్మిలతో సహా ఎవరు ఏ పార్టీ లో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా ప్రజల ఆశీస్సులు జగన్ పైనే ఉన్నాయని ధీమ వ్యక్తం చేశారు. జగన్ (Ys Jagan) కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే పేద కుటుంబాలు నష్ట పోతాయని అన్నారు. అందుకే లోకేష్ (Nara Lokesh) నావ మునిగి పోయిందని, జాకీలు వేసి లేపుతున్నారని అయినా లేవడం లేదని వైవీ సుబ్బారెడ్డి ఎద్దెవ చేశారు. ఎవరైనా ఇష్టం లేకపోతే పార్టీలు మారవచ్చని , పార్టీలో ఉండాలా?  లేదా అనేది వాళ్ళ ఇష్టం అని వ్యాఖ్యనించారు.

Also Read: కావ్యకు బిగ్ షాక్.. గర్ల్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన రాజ్.. ఆమె ఏం చేయనుంది.?

పేదవాడి సొంటితి కల నిజం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ దని కామెంట్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని.. 2.50 లక్షల మందికి టిడ్కో ఇల్లు ఇచ్చే ప్రక్రియకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. విద్య వైద్య రంగంలోనూ విప్లాత్మకమైన మార్పులు తెచ్చారని కొనియాడారు.

Advertisment
తాజా కథనాలు