కాంగ్రెస్ లో విలీనంపై ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఒంటరిగానే పోటీకి దిగడానికి వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి షర్మిల (YS Sharmila) డిసైడ్ అయ్యారు. మొత్తం 100 సీట్లలో తమ పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలోకి దించాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. రెండు చోట్ల నుంచి షర్మిల పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా పాలేరు, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి షర్మిల పోటీ చేయనున్నారు. షర్మిల తల్లి విజయమ్మ (YS Vijayamma) కూడా ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీల్చడమే టార్గెట్‌గా షర్మిల పార్టీ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. రేపు వైఎస్సార్టీపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈ అంశంపై కీలక ప్రకటన చేయనున్నారు షర్మిల. దీంతో పాటు పోటీ చేయబోయే అభ్యర్థులను సైతం ఆమె అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఖరారైన వైఎస్సార్టీపీ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టో బయటపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. విద్యార్థులు, రైతులకు మరిన్ని వరాలు..
సూర్యాపేట- పిట్ట రాంరెడ్డి
సత్తుపల్లి - గుడిపల్లి కవిత
బోధన్- సత్యవతి
కల్వకుర్తి - అర్జున్ రెడ్డి
వనపర్తి- వెంకటేశ్వర రెడ్డి
నర్సంపేట-శాంతి కుమార్
ఆదిలాబాద్-బెజ్జంకి అనిల్
ఇది కూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!
చేవెళ్ల-దయానంద్
గజ్వేల్ - రామలింగారెడ్డి
సిద్దిపేట -నర్సింహారెడ్డి
సిరిసిల్ల- చొక్కాల రాము
కామారెడ్డి-నీలం రమేష్
అంబర్‌పేట- గట్టు రామచంద్రరావు