YCP: వైసీపీ నుంచి కీలక నేత ఎంఆర్‌సీ రెడ్డి బహిష్కరణ! తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఎంఆర్‌సీ రెడ్డి పై వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో క్రమశిక్షణ సంఘం ఆయన మీద చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. By Bhavana 21 May 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి MRC Reddy Suspended From YCP: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఎంఆర్‌సీ రెడ్డి పై వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో క్రమశిక్షణ సంఘం ఆయన మీద చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. గత కొంతకాలంగా ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆయన మీద పార్టీ కి ఫిర్యాదులు రావడంతో.. విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంఆర్‌సీ రెడ్డి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఉన్నారు. చంద్రగిరిలో పోలింగ్ రోజు, ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటన కలకలంరేపింది. ఈ కేసులో పలువురు వైఎస్సార్‌సీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఎంఆర్‌సీ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సన్నిహితుడు కావడం విశేషం. ఆయనకు గతంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు గల్లా అరుణకుమారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. Also read: అమెరికాలో సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ రికార్డు! #ycp #peddireddy-ramachandra-reddy #tirupati #mrc-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి