YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు నేతలు.. వైసీపీ ఖరారు చేసిన లిస్ట్ ఇదే!

ఏప్రిల్ లో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వైసీపీ అధినేత తమ పార్టీ నుంచి ముగ్గురు పేర్లను ఖారారు చేశారు. వైవీ సుబ్బారెడ్డి (ఓసీ), గొల్ల బాబురావు(ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాసులు (బలిజ)కు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

New Update
YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు నేతలు.. వైసీపీ ఖరారు చేసిన లిస్ట్ ఇదే!

దేశవ్యాప్తంగా 68 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ తో ముగియనుంది. ఏపీ నుంచి ముగ్గురు సభ్యులు టీడీపీ (TDP) ఎంపీ కనకమెడల, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ (YCP) ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం కూడా ఏప్రిల్ లో ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలకు వైసీపీ హైకమాండ్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. వైవీ సుబ్బారెడ్డి (ఓసీ), గొల్ల బాబురావు(ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాసులు (బలిజ) కి అవకాశం కల్పించాలని ఆ పార్టీ నిర్ణయించింది. వైవీ సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు ఎంపీగా పని చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానంలో మరో రెడ్డికి వైసీపీ అధినేత జగన్ (AP CM Jagan) అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబూరావు ప్రస్తుతం పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధినేత సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెంచారు. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రెండు లిస్ట్ లను విడుదల చేసిన వైసీపీ.. ఈ రోజు లేదా రేపు మూడో లిస్ట్ విడుదల చేయాలని భావిస్తోంది. గెలుపే లక్ష్యంగా, సర్వేల ఆధారంగా సిట్టింగ్ లను కూడా మార్చుతున్నారు జగన్.
ఇది కూడా చదవండి: YSRCP: వైసీపీ అసంతృప్తి నేతల భేటీ.. జగన్‌కు మరో షాక్ తగలనుందా?

టికెట్ దక్కని వారికి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు జగన్.  ఇందులో భాగంగానే తాజాగా రాజ్యసభ సభ్యుల ప్రకటన అని చెప్పొచ్చు. వైవీ సుబ్బారెడ్డి పేరు రాజ్యసభ సభ్యుల లిస్ట్ లో ఉండడంతో.. ఈ సారి కూడా ఆయనకు ఒంగోలు టికెట్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఇంకా మరో ఇద్దరు గొల్ల బాబారావు, జంగాలపల్లి శ్రీనివాసులుకు కూడా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: KA Paul: ‘పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది’..కేఏ పాల్ కామెంట్స్..!

వారికి రాజ్యసభకు పంపిస్తుండడంతో వారికి కూడా ఈ సారి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం లేదన్న విషయం స్పష్టమైంది. టికెట్ దక్కని కొందరు నేతలకు ఇప్పుడే పదవులు ఇవ్వడం ద్వారా మిగతా వారికి కూడా నమ్మకం కలిగించే వ్యూహంతో వైసీపీ అధినేత జగన్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు